37.2 C
Hyderabad
May 2, 2024 13: 12 PM
Slider కవి ప్రపంచం

కాపాడుకో?

#K.Harinath

ప్రజాస్వామ్య రాజ్యమిది
ప్రగతి రథంపై నడిపిద్దాం
అరచేతిలో వైకుంఠం చూపించి
పథకాల నూకలు ఎరవేసే
నాయక మూకల చరమగీతం పాడుదాం
నవజమాజ నిర్మాణం కోసం
నవయువత నడుం కట్టిరావాలి
ఓటు హక్కు బాధ్యతగా భావించి
సమర్థులెవరో అసమర్థులెవరో
స్ఫూర్తి నిచ్చే మూర్తీభవించిన
మంచినేతలెవరో ఎంచుకో
మెదడుకి పదును పెడితే
అసలైన సిసలైన నాయకుడెవరో
నీకు నీవే తెలుసుకొనగలవు
అప్పుడు గెలుపు నీదే అవుతుంది
రాష్ట్రాన్ని విజయపథంవైపు
మలుపు తిప్పిన వాడవవుతావు
ఓటు హక్కును కాపాడుకో
మనిషిగా మసులుకో..?

కొరుప్రోలు హరనాథ్
9703542598

Related posts

దటీజ్ పినరయ్: అర్ధరాత్రి అడవిలో అమ్మాయిల ఆక్రందన

Satyam NEWS

క్లాత్ బ్యాగ్ ల వల్ల మహిళలకు ఉపాధి అవకాశం

Satyam NEWS

జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు నారా లోకేష్ బీమా

Satyam NEWS

Leave a Comment