32.7 C
Hyderabad
April 27, 2024 00: 36 AM
Slider సంపాదకీయం

దటీజ్ పినరయ్: అర్ధరాత్రి అడవిలో అమ్మాయిల ఆక్రందన

kerala girls

మొత్తం 13 మంది అమ్మాయిలు హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలర్ లో బయలుదేరారు. వారి గమ్య స్థానం కోజికోడ్‌. అది వారి సొంతూరు. హైదరాబాద్ లో కరోనా ఆంక్షల కారణంగా చదువు నిలిచిపోవడంతో ఇంటికి వెళ్లిపోవాలని బయలుదేరారు.

డ్రయివర్ విష్ణు తప్ప మిగిలిన 13 మంది అమ్మాయిలే. టెంపో ట్రావెలర్ వెళుతూ ఉంది. తెలంగాణ సరిహద్దులు దాటేశారు. అర్థరాత్రి కేరళ-కర్ణాటక సరిహద్దులకు చేరారు. అప్పుడే పిడుగు లాంటి వార్త. 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.

సరిహద్దు చెక్ పోస్టు వద్ద టెంపో ట్రావెలర్ ను పోలీసులు నిలిపివేశారు. కేరళ రాష్ట్రంలోకి అనుమతి లేదని చెప్పారు. టెంపో ట్రావెలర్ లో ఉన్నది అందరూ అమ్మాయిలేనని అర్ధరాత్రి ఇలా చెక్ పోస్టు దగ్గర నిలిపివేయడం కరెక్టు కాదని డ్రయివర్ చెప్పాడు. పోలీసులు వినలేదు.

రూలంటే రూలేనని చెప్పారు. సహాయం కోసం అర్థించారు. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి గోల వారిది. ఆ 13 మంది అమ్మాయిలలో అతిరా అనే అమ్మాయి దగ్గర కేరళ ముఖ్యమంత్రి పినరయ్ సెల్ నెంబర్ ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతిరా ముఖ్యమంత్రికి ఫోన్ చేసింది.

అర్ధ రాత్రి దాటింది ఈ సమయంలో సిఎం ఫోన్ తీస్తారా? తీసినా సహాయం చేస్తారా? తిట్టి ఫోన్ పెట్టేస్తారా? అయినా సరే అతిరా ఫోన్ చేసింది. రెండవ రింగ్‌లో పినరయి గొంతు వినిపించింది. అతిరా తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పింది. అతిరా భయంతో వణుకుతున్న గొంతుతో చెప్పిన విషయాలు ముఖ్యమంత్రి శ్రద్ధగా విన్నారు.

వయనాడ్ కలెక్టర్, ఎస్పీ కి చెప్పమని అతిరాకు సలహా ఇచ్చాడు. తన దగ్గర వారి సెల్ నెంబర్లు లేవని అతిరా చెప్పింది. కలెక్టర్, ఎస్పీల మొబైల్ నంబర్‌ను కూడా సీఎం తెలియజేశారు. సీఎం సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

కలెక్టర్ కన్నా ముందు ఎస్పీ రెస్పాండ్ అయ్యారు. 20 నిమిషాలలో తిరునల్లి ఎస్ఐ వాహనంతో సహా అక్కడకు వచ్చేశాడు. సరిహద్దులోనే వారికి టెంపరేచర్ చూశారు. కాళ్లూ చేతులూ కడుక్కోమని చెప్పారు. తక్షణమే ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ చెక్ చేశాడు.

వెంటనే అక్కడ నుంచి అమ్మాయిలను సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్లారు. ఒక్కో అమ్మాయిని వారి వారి ఇంటి వద్ద దింపేశారు. ముఖ్యమంత్రి పినరయ్ చేసిన సహాయాన్ని 13 మంది అమ్మాయిలు జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. దటీజ్ పినరయ్ అన్నారు ఆయా కుటుంబాల వారు.

సరిహద్దుల్లో నిలిపివేయలేదు. ముఖ్యమంత్రులు చర్చించుకోలేదు. పోలీసు అధికారులు తర్జన భర్జన పడలేదు. ఆ అమ్మాయిల ఆరోగ్యం పరీక్షించుకుని తమ రాష్ట్రంలోకి రానిచ్చారు. రభస లేదు రచ్చ లేదు. కన్ఫ్యూజన్ అంతకన్నా లేదు.

ఈ అమ్మాయిలంతా  హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసేవారు. అందరూ క్షేమం. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన రగడ చూసిన తర్వాత ఇది గొప్పగా అనిపించడం లేదూ?

Related posts

(Best) Cbd Oil Pure Relief Cbd Oil Legal In Nevada

Bhavani

గృహలక్ష్మి పథకానికి 10 వరకే గడువు

Bhavani

తెలంగాణలో టిడిపిని బతికిద్దాం రండి

Satyam NEWS

Leave a Comment