38.2 C
Hyderabad
April 29, 2024 14: 56 PM
Slider తూర్పుగోదావరి

యువగళం 2.0కు విశేష స్పందన

#yuvagalam

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపే విధంగా మళ్లీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించడంతో లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210 రోజు యాత్రను యువనేత నారా లోకేష్ పున:ప్రారంభించారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు యువనేత పాదయాత్ర చేశారు.

యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభ కావడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొంగి చూస్తున్నది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఎక్కడ ఆపారో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కంచుకోటగా ఉన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రను జగన్ ప్రభుత్వం పోలీసుల సహాయంతో అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.

లోకేష్ మాట్లాడుతున్న మైక్ లాక్కున్నారు. ప్రచార రథం సీజ్ చేశారు. సభలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని ఆటంకాలు పెట్టారు. చిన్న స్టూల్ పై ఎక్కి ప్రసంగిస్తుంటే ఆ స్టూల్ ను కూడా పోలీసులు లాక్కున్నారు. అయినా సరే మైక్ లేకుండా…. కనీసం స్టూల్ పై ఎక్కి ప్రసంగించే వీలు కూడా లేకుండానే లోకేష్ తన పాదయాత్రను కొనసాగించారు.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జన ప్రభంజనంగా యువగళం మారింది.

లోకేష్ ఎక్కడా తగ్గలేదు. యువగళం పాదయాత్రపై రాళ్లు రువ్విన వారిని వదిలేసి లోకేష్ కు రక్షణగా నిలబడ్డ వారిపై పోలీసులు కేసులు పెట్టారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర, మరో వైపు చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోందని…తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి చంద్రబాబు అరెస్టుకు జగన్ కుట్ర చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండానే అరెస్టు చేసి ఆ తర్వాత తాము చేయాలనుకున్నవన్నీ చేశారు. చంద్రబాబుపై చిన్న ఆధారం లేదని హైకోర్టు తేల్చేసింది. 53 రోజుల పాటు నిర్బంధించారు. వరుసగా కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ న్యాయపోరాటం కోసం ఎక్కువ సమయం వెచ్చించారు. చంద్రబాబు పై పెట్టేవి తప్పుడు కేసులేనని జాతీయ స్థాయిలో మీడియా దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుల్లోనూ దాదాపుగా నిరూపించారు.

నిధుల దుర్వినియోగం జరిగిందని కానీ.. చంద్రబాబు లంచాలు తీసుకున్నారని కానీ నిరూపించలేకపోయారు. మిషన్ కంప్లీట్ అవడంతో నారా లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తున్నారు. అడ్డంకులను అధిగమించిన తరవాత చేస్తున్న పాదయాత్ర మరింతగా రీ సౌండ్ వస్తున్నది. ప్రజల నుంచి స్పందన రెట్టింపు అవుతున్నది. సాఫీగా సాగిపోయే యాత్రకు ఆటంకాలు కల్పిస్తే… నెలకు కొట్టిన బంతిలా యువగళం ఎగసిపడుతున్నది.

Related posts

కొల్లాపూర్ లో యాసంగి పంట వెరిఫికేషన్ ప్రారంభం

Satyam NEWS

టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష

Satyam NEWS

కుతుబ్ మినార్ యాజమాన్య హక్కుల వ్యాజ్యం కొట్టివేత

Satyam NEWS

Leave a Comment