32.7 C
Hyderabad
April 27, 2024 01: 22 AM
Slider ముఖ్యంశాలు

ట్రంపెట్: ఈ టూర్ రెండు దేశాలకూ ఉపయోగకరమైనది

trump modi

రెండు రోజుల భారత్ పర్యటన ఇరు దేశాలకు ఉపయుక్తమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత్‌తో ఆర్థిక సంబంధాలు పెరిగాయని ట్రంప్ అన్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌ లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇండియాతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చించామని, రక్షణ రంగంలో 300 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని ఆయన తెలిపారు. పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇస్లాం తీవ్రవాదం పై కూడా చర్చలు జరిగినట్టు వెల్లడించిన ట్రంప్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పారు.

Related posts

ఓ గాడ్: పొలాల్లో దిగిన జిందాల్ జెట్ విమానం

Satyam NEWS

ఇది సునామీ కంటే తక్కువ కాదు: ఎమ్మెల్యే సీతక్క

Bhavani

మానవత్వం చాటిన జనచైతన్య ట్రస్ట్

Bhavani

Leave a Comment