37.2 C
Hyderabad
May 1, 2024 11: 32 AM
Slider కవి ప్రపంచం

ఉద్వేగ గళోద్దీపన దరువు

#Sandhya Sutrave New

అణచి వేతకు వ్యతిరేక లక్ష్యం

ప్రజాఉద్యమంలో ప్రజా సంస్కృతి ప్రేరేపణ

భావజాలాన్ని పాటగా అభినయం

ఉద్వేగరచన  ధిక్కారపాట ధీటైన దరువు

ఆహార్యం గొర్రెల కాపరి

పంచకట్టుతో  భుజాన  నల్లని  దుప్పటి

చేతిలోకర్ర  మణికట్టుకు ఎర్రరుమాలు

అతనొక  ప్రసిద్ద సామాజిక సాంస్కృతిక ముఖచిత్రం

అస్త్రాలుగా  జననాట్య మండలి నాటక బృందం, జానపదంలో జనపదంపై పట్టు

ప్రజలకు అర్థమయ్యే మాండలికంలో

అణగారిన వర్గాల జీవితాల గురించి

గద్దర్ ఆట పాట  వేసిన దరువు

అన్ని ప్రాంతాలకు సుపరిచితం 

అతని ప్రత్యేక శైలి సందేశం

విధానం తెలుగు చిత్ర పరిశ్రమ

కవులు గాయకులపై

చూపింది శాశ్వత ప్రభావం 

అయిదు దశాబ్దాల ఉద్యమ జీవితం

బహుజన కోణం తెలంగాణ ఉద్యమం

అజ్ఞాత జీవితం గా విభజితం

గుమ్మడి విఠల రావు

విద్యలో సాంకేతిక పట్టభద్రుడు

గద్దర్ గా బ్యాంకు ఉద్యోగం తిరస్కృతి

పొడుస్తున్న పొద్దుమీద

నడుస్తున్న కాలమా పాట

తెలంగాణ ఉద్యమానికి  ఒక ఊపు ఊపి

ప్రజలను ముందుకు నడిపించింది

బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి 

పాట నంది అవార్డు లను ఇప్పించింది

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి

వాగ్గేయ కళాకారుడు  విప్లవకవి  గాయకుడు

ప్రజలదన్నుగా  వెన్నులో తూటా తో సైతం

ఊరూరా తిరిగి చేసిన దరువు సవ్వడి

మన చెవుల్లో ఎప్పుడు మారుమ్రోగుతూనే ఉంటుంది

భౌతికంగా మన మధ్య లేకున్నా

అతని ఆహార్యం మన కళ్ళకు  కాదెప్పుడు దూరం

పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో

అజరామరంగా నడుస్తూ నడిపిస్తూనే ఉంటుంది ఇది తథ్యం.

(గద్దర్ స్మృతిలో)

సంధ్య సుత్రావె, ఫోన్ : 9177615967, హైదరాబాద్

Related posts

‘మోదీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌ కు సమన్లు

Sub Editor

పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించేస్తున్నాం

Satyam NEWS

చీట్:ద్వంద్వ పౌరసత్వంతో మోసం చేస్తున్నరమేష్ బాబు

Satyam NEWS

Leave a Comment