28.7 C
Hyderabad
April 28, 2024 05: 53 AM
Slider కవి ప్రపంచం

అక్షరార్చన

#harinath

అనురాగ వనిత వమ్మా

నీవమృత మూర్తివమ్మా

త్యాగమే ఘనతని

నిలిచిన నిండుకుండవమ్మా         

నీ చిరునవ్వులె వెన్నెల దివ్వెలు

నీ దరహాసం వికసిత వదనం

సరస్వతిని వశపరిచిన

బృహస్పతివి నీవమ్మా

అడుగడుగున ధైర్యాన్ని స్థైర్యాన్ని

సమస్యల వలయాన్ని సునాయాసంగా

ఛేదించి మార్గ దర్శిగ నిలిచిన

అపురూపమృత గురుమూర్తివమ్మ

మీ సేవాభావ పురస్కార ఆదరణ

ఉన్నత గవాక్షి అక్షర రక్షణ కవచాలమ్మ

మీ జీవన నిస్వార్థ యాత్ర

గుండె గుండెకొక దర్పణమమ్మా

శక్తిని, యుక్తిని భక్తిని బడివొడిని

ప్రసాదించిన వేంకటేశ్వరుని గుడి

మీ ఇలవేల్పుగ తీర్చిదిద్దుకున్న

మహోన్నత చరిత నీ దమ్మా

అనురాగవనితవమ్మా

నీ వమృత మూర్తి వమ్మా

కె.హరనాథ్, 9703542598

Related posts

జాతీయ స్థాయిలో ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్

Bhavani

దేశవ్యాప్త హర్తాళ్ ను జయప్రదం చేయండి

Satyam NEWS

కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలి

Satyam NEWS

Leave a Comment