38.2 C
Hyderabad
April 28, 2024 22: 05 PM
కవి ప్రపంచం

నారీ శక్తి

#Puli Jamuna

వేకువ వాకిట ఉషోదయ ఉషస్సు అవుతూనే

ఇంటిల్లిపాదికీ ఆత్మీయ అక్షయపాత్రవుతుంది

లలిత లావణ్య సుమ సుకుమారత్వంతో

ఆత్మీయ లతలనల్లే కల్పవల్లవుతుంది

రుధిరాన్ని క్షీరంగామార్చి పిల్లలనుపెంచడమే కాదు

దేశాన్ని  సమర్థవంతంగా పరిపాలిస్తుంది

తడియారని తపనలతోనే నిత్యం తల్లడిల్లుతూనే

త్యాగ భావాలకు తరగని పెన్నిధి అవుతుంది

ఆంక్షల కంచెలను ఛేదించి ఆత్మవిశ్వాసంతో

విభిన్న రంగాలలో విజేత అవుతుంది

ఆగ్రహిస్తే అనలకీలలు కురిపించే అగ్నిగోళమై

దుర్మార్గాన్ని దునుమాడే ఆదిశక్తి అవుతుంది

ఆటుపోటులెదురైనా అంతర్యుద్దం చేస్తూనే

చెదరని చిరునవ్వులకు చిరునామా అవుతుంది

గాయాలను అస్తిత్వపు పునాదులుగా మలచి

చులకన  చేసే సమాజానికి సవాలు చేస్తూ

అంతరిక్షానికెగసి అవనికి కీర్తి పతాకవుతుంది

ఎంత ఎదిగినా ఒదిగి వుండే సహనంతో

సకల కళానిధియై అద్భుతాలను ఆవిష్కరిస్తుంది

అలుపెరుగని ఓర్పుతో ప్రగతిపథంలో పయనించే

ఓ మహిళా నీకు వేనవేల వందనాలు

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682.

Related posts

దు:ఖపు మచ్చ

Satyam NEWS

ఎందుకో అంత హర్షం

Satyam NEWS

గుర్తుచేసుకుందాం….

Satyam NEWS

Leave a Comment