30.7 C
Hyderabad
April 29, 2024 05: 50 AM
Slider కవి ప్రపంచం

ప్రపంచ శాంతి – పంచశీల

#PVS Krishnakumari

మితిమీరిన సామ్రాజ్య వాదం

దురాక్రమణలు, వలసవాదాలు

ప్రపంచ యుధ్ధాలు, అణ్వస్త్రాలతో

నాగరికత, మానవత్వాలను

నిశివడిలోకి నెట్టివేసినవేళ

నవ శకానికి నాందిపలుకుతూ

తూర్పున ఉదయించింది ఓ కాంతి కిరణం

అగ్రరాజ్యాల అహంకారం

పశ్చిమాన కుంగిపోగా

శాంతిపూర్వక, సహజీవన

సామరస్య,సహకారాల సమ్మెళనంతో

శాంతికాముకల ముద్దుబిడ్డ

‘ పంచశీల’ పేరుతో

బాలభానుడిలా ఉదయించి

యావత్ ప్రపంచానికి తన

నులివెచ్చని కిరణాలను పంచింది

గౌతమబుద్ధుని అహింసాసిద్ధాంతాలనే

బోధి వృక్షం నీడలో పరిఢమిల్లే

మన భారతావని, తన సహచరులతో కలసి

ప్రపంచ శాంతికి  అందించిన

ఈ అపూర్వ కానుక

” పంచశీల”

భారతజాతి సంస్కృతి కి ప్రతీక

పీ.వీ.యస్. కృష్ణ కుమారి

Related posts

హీరోయిన్ సునైన ఫొటో గ్యాలరీ

Satyam NEWS

మహిళా ఎస్సై శిరీషకు డిజిపి డిస్క్ అవార్డు ప్రదానం

Satyam NEWS

ఖైరతాబాద్ ప్రాంతాన్ని క్వారంటైన్ చేస్తున్న అధికారులు

Satyam NEWS

Leave a Comment