40.2 C
Hyderabad
April 29, 2024 17: 05 PM
కవి ప్రపంచం

గాజు కన్ను

#Kommineni Krishnaveni

పురిటినెప్పులతో ప్రసవ వేదన

పంటి బిగువులతో పచ్చని

వెచ్చని భావన నీవైతే     

నా ఆశ, నాశ్వాస, నా ధ్యాస    

నా తానం, నా పల్లవి నీవైతే

నీ కోసం నేను కార్చిన ఆనంద బాష్పాలు

ఇప్పుడు తడి ఆరిపోయి, వెచ్చని ఎండకు ఎరుపెక్కి

మండుటెండల్లో మంచుతెరల్లా

మానవత్వం ఉన్నట్లు, మూగ భాష చేస్తుంటే

భాష రాక మూగపోయి, మౌనంగా రోదిస్తున్న మునిని నేను

పాలు ఇస్తే తల్లి, పాలు పోస్తే పాము

పాలు తాగి మనిషి పామైనాడు

విష సర్పమై విజృంబిస్తున్నారు, అను నిత్యం అమ్మను ఛిద్రం చేస్తున్నారు

పంపకాలలో నిన్ను పంచేస్తూ, పరిస్థితులు బాగాలేవంటూ

వంచన చేసి పంచన  పడేస్తున్నారు

కాలం రాక, చావు రాక

చితికిపోయిన చాపలా, చింతలతో, చీత్కారాలతో

చలనం లేక బ్రతుకుతున్న ఛిద్రమైన చేదు అనుభవాలతో

చిన్నబోయిన మనస్సుతో, భయంతో భయ భ్రాంతులతో

కళ్ళలోని కాంతులను అంధకారం చేస్తూ

గాజు కళ్లలా నీరు రాక అమ్మను చింతలతో చితి చేస్తున్నారు

ఆయేషా, ఆశియాలది మానవ మృగాలా అకృత్యం అయితే

అమ్మ రక్తం పంచిన మీకు రక్త కన్నీరు  ఇస్తున్న

రక్త సంబంధీకులా, రాబంధులా, రాక్షసులా ………

అందుకే అమ్మకు కావాలి అనునిత్యం ఆదరణ, ఆప్యాయత

బలమైన చట్టాలు, సత్కారాలు, చప్పట్లు

కొమ్మినేని కృష్ణవేణి, 9849371688

Related posts

మనసు పడ్డా..

Satyam NEWS

పండుగొచ్చింది

Satyam NEWS

రామచంద్రుని రాయబారి

Satyam NEWS

1 comment

Mohan April 13, 2021 at 10:55 AM

Chala bagundi pinni.?✍?

Reply

Leave a Comment