35.2 C
Hyderabad
April 27, 2024 15: 00 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

#VSU

కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సావిత్రిబాయి గొప్పతనం మరియు సంస్కరణలు విద్యార్థులకు తెలియజేశారు.

మొట్టమొదటి మహిళా ఉపాధ్యారాయులుగా ఆమె ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొని ఒక గొప్ప స్థాయి కి వచ్చిందని అన్నారు. ఆమె చేపట్టిన అనేక సంఘ సంస్కరణలు ఎంతో మందికి ఆదర్శప్రాయం అని అన్నారు. చిన్నతనంలోనే జ్యోతిరావు పూలే తో ఆమె వివాహమయినప్పటికీ , భర్త ప్రోత్సాహం తో ఉన్నత విద్యనభ్యసించి కఠోర దీక్షతో ఉన్నత స్థాయికి ఎదిగారు అని పేర్కొన్నారు. ఆమె జీవితమే ఈనాటి ఉపాధ్యాయులకు ఒక గొప్ప సందేశమన్నారు.

కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి విజయ ఆనంద కుమార్ బాబు మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సుజా ఎస్ నాయర్, డీన్ డా. సి హెచ్ విజయ, డా. సి ఎచ్ సాయి ప్రసాద్ రెడ్డి సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రాగ్రాం అధికారులు డా. కె. సునీత. డా. కె. విధ్యా ప్రభాకర్, డా. ఆర్. మధుమతి మరియు బోధనా బోధనేతర సిబ్బంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగాధంలోకి నెట్టిన జగన్ రెడ్డి

Satyam NEWS

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

Sub Editor

నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

Satyam NEWS

Leave a Comment