ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 2.1 km మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు దిశ నుండి గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర మరియు యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు అక్కడక్కడ, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.