38.2 C
Hyderabad
April 29, 2024 12: 47 PM
Slider నిజామాబాద్

పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు

#kamareddyschools

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పాఠశాలలు పండగ  వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పాఠశాల అంగన్వాడీ కేంద్రాల వద్ద పండగ సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో చదువుల తల్లి సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలు గ్రామాలలో స్థానిక సర్పంచ్ లు విద్యార్ధులకు మాస్క్ లను, పలకలను అందజేశారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ అశోక్ పటేల్ సందర్శించి  విద్యార్థులతో మాట్లాడారు.

ప్రతి ఒక్క విద్యార్థి మాస్కు ధరించి భౌతిక దూరం పాటించి తరగతులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఆయా గ్రామాల్లోని ఆయా గ్రామాల సర్పంచ్ లు, పాఠశాలల ఉపాధ్యాయ బృందం అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు హాజరయ్యారు.

జీ లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

చేనేతను ధరించండి..ఆ రంగ కార్మికులను ప్రోత్సహించండంటున్న…!

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: అల్లకల్లోలంగా పాకిస్తాన్

Satyam NEWS

పెట్రోలు బంకు యాజమాన్యం బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment