38.2 C
Hyderabad
April 28, 2024 19: 46 PM
Slider ముఖ్యంశాలు

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

#CM Jagan

విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు’’ అని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం.

తొలి విడత నాడు-నేడు కింద 15వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను.. ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నాం’’ అని తెలిపారు.

Related posts

సంక్రాతి ఎఫెక్ట్ :పంతంగి టోల్ గేట్ వద్ద 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు

Satyam NEWS

స్వర్ణ ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS

Leave a Comment