40.2 C
Hyderabad
April 26, 2024 13: 01 PM
Slider శ్రీకాకుళం

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

#scienceday

శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగినది. ముందుగా సి .వి. రామన్ చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా పాఠశాలలో పలు రకాల విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను కూడా అందచేశారు.

ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు విద్యార్థులు చేయడం వలన వారిలో సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని, భావి శాస్త్రవేత్తలుగా నేటి విద్యార్థులు తయారవుతారని అన్నారు.భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కరణం శ్రీహరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విజ్ఞాన శాస్త్రాన్ని ఇష్టంగా చదవాలని అప్పుడే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న విషయాలను అవగాహన చేసుకుంటారని, ప్రతి విషయాన్ని అన్వేషణ దృష్టితో విద్యార్థులు చూడాలని అన్నారు.

జీవశాస్త్ర ఉపాధ్యాయులు బుడుమూరు అప్పలనాయుడు మాట్లాడుతూ సి.వి.రామన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి పెంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు అయిన కరణం శ్రీహరిని, బుడుమూరు అప్పలనాయుడు ను సన్మానించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బలివాడ ప్రభాకరరావు, బెండి శారద, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, పొన్నాన ఉషారాణి, కింతలి ప్రసూన, మోర అనిత, తంగి పద్మావతి, పంచిరెడ్డి మోహనరావు, సంపతి రావు రమణమ్మ, బొంగు వెంకటరమణమూర్తి, నక్కిన స్వప్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

Satyam NEWS

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

Satyam NEWS

పేదలను ఆదుకుంటున్న సియం రిలీఫ్ ఫండ్

Satyam NEWS

Leave a Comment