28.7 C
Hyderabad
April 26, 2024 09: 22 AM
Slider కృష్ణ

విద్యుత్ చార్జీలపై పెనమలూరు లో బోడె ప్రసాద్ నిరసన

#TDP Penamaluru

విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఒక్క చాన్స్ అంటూ అందలం ఎక్కి, ఇప్పుడు విద్యుత్ వాడకం స్లాబులు మార్చడం ద్వారా లాక్‌డౌన్ వల్ల ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల వెన్ను విరిగేలా, దొడ్డి దోవన భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జీ బోడె ప్రసాద్  అన్నారు.

సామాన్య ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో నేటి ఉదయం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  అనుమోలు ప్రభాకర రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు  వెలగపూడి శంకర బాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు, కంకిపాడు మండల పార్టీ అధ్యక్షులు  సూదిమళ్ళ రవీంద్ర ప్రసాద్, పెనమలూరు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు  కోయ ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇంకా పోరంకి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  వడ్లమూడి శుభ శేఖర్, పెనమలూరు నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు  బొర్రా కృష్ణ, తాడిగడప గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  తుమ్మల రాం కుమార్, వేల్పూరు గ్రామ పార్టీ అధ్యక్షులు  చీలి సురేంద్ర బాబు, రాష్ట్ర ఎస్.సి.సెల్ సభ్యులు  తూమాటి స్టాలిన్ బాబు, కృష్ణాజిల్లా ఎస్.సి. సెల్ కార్యదర్శి  చలమాల జోజికుమార్, పెనమలూరు మండల ఎస్.సి. సెల్ అధ్యక్షులు పులి విజయ్ హాజరయ్యారు.

వీరితో బాటు కంకిపాడు మండల ఎస్.సి.సెల్ అధ్యక్షులు  దొప్పలపూడి నాగేశ్వరరావు, టి.ఎన్.టి.యు.సి. అధ్యక్షులు  కొసరాజు మల్లేశ్వర రావు, కార్యదర్శి  కారుమంచి శివాజీ, తెలుగు మహిళా నాయకురాళ్ళు రమాదేవి దొనేపుడి, యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫలించిన ‘నేనుసైతం’ పోరాటం: ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీసీ లకు కేటాయించాలి

Satyam NEWS

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Bhavani

Leave a Comment