38.2 C
Hyderabad
April 27, 2024 16: 50 PM
Slider ముఖ్యంశాలు

కోకాపేట భూముల అమ్మకం లో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత?

#setakka

హైదరాబాద్ శివారులోని కోకా పేట భూముల బండారం బయట పెడతారనే భయంతోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం  అక్రమ హౌస్ అరెస్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.

పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలను భగ్నం చేస్తామని ఆమె తెలిపారు.

బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టిన కేసీఆర్ సాధించింది ఏమిటని ఆమె ప్రశ్నించారు. భూములు అమ్మిన డబ్బుల తో అభివృద్ది చేస్తానని అనడం సిగ్గు చేటని సీతక్క విమర్శించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ లో అక్రమ అరెస్ట్ లు అక్రమ కేసులు నిర్బంధాలు తప్ప మరొకటి లేదని ఆమె అన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని అక్రమ అరెస్ట్ లు చేసి ప్రజా పోరాటాలను ఆపలేరని సీతక్క వెల్లడించారు.

గడిచిన 7యేండ్ల లో కెసిఆర్ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని, ప్రభుత్వ భూములను ప్రభుత్వం లో పని చేస్తున్న కొంత మంది వ్యక్తులకు, వారి సంస్థలకు ధారాదత్తం చేసిన కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్, మండల అధ్యక్షుడు చేన్నోజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం

Satyam NEWS

మరణించిన మహానటులకు ఘన నివాళి

Satyam NEWS

మండుతున్న ఎండలు

Bhavani

Leave a Comment