40.2 C
Hyderabad
April 29, 2024 15: 35 PM
Slider వరంగల్

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

school day

జనగామ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అంగరంగ వైభవంగా స్వయం పరిపాలనా దినోత్సవం వేడుకలు జరిగాయి. స్వయం పరిపాలనా దినోత్సవంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమ తోటివిద్యార్థులకు పాఠాలు బోధించారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా విద్యాశాఖాధికారిగా జాటోతు జంపన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా జాటోతు ఆశ, ఫిజికల్ డైరెక్టర్లు నునావత్ రాజు, ఎర్రవెల్లి ప్రణతి వ్యవహరించారు. నేటి విద్యార్థి ఉపాధ్యాయులలో ప్రథమ బహుమతి లావుడ్య అమూష, ద్వితీయ బహుమతి లాకావత్ హిమవర్ష, తృతీయ బహుమతి లావుడ్య నరేష్ చతుర్ధ స్థానంలో సాయబోయిన అఖిల, పంచమ స్థానంలో దామెర వినోలియా, షష్టి స్థానంలో ఆలేటి జంపన్న నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొగిలిచర్ల చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు నీతిగా, నిజాయితీగా, సత్ప్రవర్తన కలిగి, పట్టుదలతో సన్మార్గంలో పయనించి, ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలల భవిష్యత్తులోనే దేశ భవితవ్యం ఆధారపడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జంగ వీరయ్య, వైస్ చైర్మన్ ఆవుల రజిత సంపత్, సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు పింగిళి విజయపాల్ రెడ్డి, బానోతు రవీందర్, గాదె జోసెఫ్ బేబి, ఇర్రి క్రిష్ణారెడ్డి, మచ్చ చిరంజీవులు, మహ్మద్ యూసుఫ్ పాషా, చిదురాల శ్రీనివాస్, కొండం రజని, ప్రజ్ఞాపురం ప్రవీణ్ కుమార్, అడెపు శ్రీనివాస్, నాంపల్లి అనిల్ కుమార్, కందకట్ల నీరజా, అన్వర్ సుల్తాన, సిఆర్పి తాటికొండ మహాలక్ష్మి, ఆర్ట్ టీచర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ధ్యేయం

Satyam NEWS

దళిత కాలనీ నిధులు దర్జాగా దారిమళ్లింపు

Satyam NEWS

జాతీయ సాధన సర్వే మొదలయింది

Satyam NEWS

Leave a Comment