30.7 C
Hyderabad
April 29, 2024 03: 44 AM
Slider ముఖ్యంశాలు

రాబంధు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దమ్ముందా కేసీఆర్..

#shabbirali

రాష్ట్రంలో రాబందుల్లా తయారైన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే దమ్ము నీకు ఉందా కేసీఆర్ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. త్వరలో కేసీఆర్ సహా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గల్లంతయ్యే రోజులు దగ్గర పడ్డాయని జ్యోస్యం చెప్పారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 32, 40 వార్డుల నుంచి సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో దళిత బందులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని.. కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద నుండి 3 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే టికెట్ రాదని చెప్పారని, పార్టీలో ఉండరని తాను చాలా సార్లు చెప్పిన వైఖరి మార్చుకోవడం లేదని, సరిగా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తరిస్తా అంటూ ప్రసంగించారని గుర్తుచేశారు.

మరోసారి ఇలా చేస్తే టికెట్ రాదనడంపై సీఎం కేసీఆర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టేనన్నారు. కేసీఆర్ నిజాయితీ గల ముఖ్యమంత్రి అయితే ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల చిట్టాబయటపెట్టి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి సిట్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు లబ్ధిదారుల నుండి మూడు మూడు లక్షలు తీసుకున్న వారి వద్ద నుండి వెంటనే ఆ ప్రజాధనాన్ని ఖజానాకు రికవరీ చేయించి నీ నిజాయితీ నిరూపించుకో కేసీఆర్ అంటూ సూచించారు. లేకపోతే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బందిపోట్లకు నాయకునిగా మిగిలిపోతాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బందిపోటుల వలె ప్రతి పనిలో 30% కమిషన్ల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలందరిపై విచారణ జరిపిస్తామునై, ప్రజల నుంచి తిన్న సొమ్మును కక్కిస్తామన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల కలలు సాకారం చేస్తామని చెప్పారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో 217 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Satyam NEWS

నో నో: మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి రానంటే రాను

Satyam NEWS

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment