23.2 C
Hyderabad
September 27, 2023 21: 23 PM
Slider సినిమా

షాలిని పాండే బాలివుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ

Shalini-Pandey-Hot-Photoshoot-3

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ షాలిని పాండే. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న షాలిని, గ్లామర్ షోకి కూడా తాను వెనుకాడనని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చింది. అయితే అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయినా కూడా షాలిని కెరీర్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ఈ సమయంలో మేకోవర్ పై దృష్టి పెట్టిన షాలిని పాండే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ లోనే ఛాన్సు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న షాలిని పాండే, త్వరలో బాలీవుడ్ లో మెరవనుంది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ హౌసుల్లో యష్‌రాజ్‌ సంస్థ ఒకటి, ఈ బ్యానర్ షాలిని పాండేతో మూడు సినిమాలు చేసే డీల్‌ కుదుర్చుకుంది. ఈ మూడు సినిమాల్లో ఒకటి హిట్టయినా షాలిని పాండేకి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంటుంది. పైగా యష్‌రాజ్‌ తీసేవన్నీ భారీ సినిమాలే కావడం వల్ల షాలిని పాండేకి లక్కీ ఆఫర్ దక్కినట్లే. మరి ఈ మూడు సినిమాల అఫర్ లో షాలిని ఏ హీరో పక్కన నటిస్తుందో చూడాలి.

Related posts

27న ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ కంపెనీ ప్రారంభించనున్న హీరోయిన్ పూర్ణ

Satyam NEWS

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ట్రాజెడీ: వృద్ధ దంపతులను ఢీకొన్న కావేరీ బస్సు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!