ఛలో ఆత్మకూర్ కార్యక్రమం సందర్భంగా పోలీసులను దుర్భాషలాడిన కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెంనాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ పొందారు. అయితే మంగళగిరి న్యాయస్థానంలో పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో ఆయన శుక్రవారం న్యాయమూర్తి ముందు హాజరైనాడు. ఛలో ఆత్మకూర్ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు ఇంటి వద్ద ఆయన పోలీసులపై దుర్భాషలాడిన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు కు 50వేల పూచికత్తు తో మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
previous post