29.7 C
Hyderabad
May 2, 2024 04: 14 AM
Slider కరీంనగర్

లాక్ డౌన్ వేళల్లో ప్రజలు బయటకు రావద్దు

#VemulawadaPolice

కరోనా అదుపు చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు.

వాహనాలను తనిఖీ చేసి ప్రజలకు, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రజలు అందరూ విధిగా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

అనవసరంగా రోడ్లపైకి వస్తే మాత్రం అంటువ్యాధుల చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గా పలు వాహనదారులను విచారించిన ఎస్పీ రాహుల్ వారు చెప్పిన కారణాలు సరిగా లేని వారి వాహనాలను సీజ్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లాక్ డౌన్ వేళల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఉదయం 10 గంటల తరువాత  ప్రజలు రోడ్ పైకి  రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎస్పీ వెంట వేములవాడ సి ఐ వెంకటేష్ ఉన్నారు.

Related posts

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి: సిఐటియు

Satyam NEWS

ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటే విధుల నిర్వహణ సమర్ధంగా ఉంటుంది

Satyam NEWS

ప్రేమించలేదనే కారణంగా యువతిని చంపిన మూర్ఖుడు

Satyam NEWS

Leave a Comment