30.7 C
Hyderabad
April 29, 2024 05: 39 AM
Slider ప్రపంచం

రూపు మార్చుకుంటున్న కరోనా కావాలని సృష్టించినదే

Kovid-19

ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మానవులు రూపొందించినదేననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వైరస్ అయితే ప్రపంచంలోని ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా మ్యుటేషన్ జరిగే అవకాశం లేదని శాస్త్రవేత్తలు బలంగా చెబుతున్నారు.

ఇన్ని రకాలుగా మ్యుటేషన్ జరుగుతున్న కరోనా వైరస్ తిరిగి తిరిగి మళ్లీ వస్తున్నది. కొన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. ఉదాహరణకు లండన్​లో లాక్​డౌన్ సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశముందని బ్రిటన్​ వైద్యశాఖ మంత్రి మాట్​ హాన్​కాక్​  తెలిపారు.

కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టంచేశారు. డిసెంబరు 19న లండన్ సహా ఇంగ్లాండ్ తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో రెండు వారాల లాక్​డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్​ జాన్సన్ ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబరు 30న పరిస్థితి సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బ్రిటన్​లో ఇప్పటివరకు 67,503 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. లండన్ లో కొత్త మ్యుటేషన్ కారణంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు.

మ్యుటేషన్ కారణంగా వైరస్ తన రూపును మార్పుకుని గుణాలను కూడా మార్చుకుంటున్నది. దీనివల్ల కూడా కరోనా ఇప్పుడు సోకిన వారికి లక్షణాలు కూడా మారవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related posts

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

ముస్లింలు ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోండి

Satyam NEWS

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

Satyam NEWS

Leave a Comment