40.2 C
Hyderabad
April 29, 2024 16: 42 PM
Slider కడప

దుకాణాల ముందు జనాలు క్యూ కోసం గడులు ఏర్పాటు

social distencing

కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ తో కడప జిల్లా రాజంపేట లోని కూరగాయలు దుకాణాల ముందు గురువారం జనాలు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేయడంలో భాగంగా మునిసిపల్ అధికారులు గడులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పంజా విసరడంతో దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరాయి.

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జన సామర్థ్యం ఉండే గుడి, బడి, వ్యాపార వాణిజ్య సముదాయాల ను మూసి వేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ ను పాటించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయలకు మినహాయింపు ఇచ్చారు.

రాజంపేట పట్టణం మధ్యలో ఉన్న కూరగాయల మార్కెట్ ను కాలేజీ గ్రౌండ్ కు తరలించారు. అక్కడ కూడా జనాలు గుమి కూడ కుండా మునిసిపల్ అధికారులు మనిషికి , మనిషికి దూరం పాటిస్తూ ముగ్గు తో గడులు ఏర్పాటు చేశారు. కొనుగోలు దారులు అందులో నిలబడి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేయాలని అధికారులు ప్రజలను ఆదేశించారు.

Related posts

రేవా రిసార్ట్స్ వ్యవహారంపై నారా లోకేష్ సీరియస్

Satyam NEWS

ప్రజా సమస్యలపై ఇంటింటికి తెలుగుదేశం

Satyam NEWS

పేకాడుతూ దొరికిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment