32.7 C
Hyderabad
April 26, 2024 23: 01 PM
Slider విజయనగరం

బిజీ షెడ్యూల్లో కూడా 25 ఫిర్యాదులను స్వీకరించిన విజయనగరం ఎస్పీ

#deepikaips

ప్ర‌తీవారం మాదిరిగానే విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచీ ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  ఎం. దీపిక‌ నిర్వహించారు. మొత్తం 25 మంది బాధితుల‌ నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

వివ‌రాల్లోకి  వెళితే… బాడంగి మండలం, కోడూరు కి చెందిన ఓ బాదితురాలు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ ఆమె పొలంలో ఆదే గ్రామానికి చెందిన కొంతమంది దౌర్జన్యంగా పొలంలోనికి ప్రవేశించి, వరి పంటను పాడు చేసారని, వారిపై చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట ప్రకారం చర్య తీసుకొని ఫిర్యాదికి న్యాయంచేయాలని బొబ్బిలి రూరల్ సీఐని ఆదేశించారు.

దత్తిరాజేరు మండలం, పాచలవలస కి చెందిన మ‌రో బాదితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకొన్నట్లు, అమె బంధువులు వారిని గ్రామం విడిచి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాడెంట్స్ ను పిలిచి, కౌన్సిలింగ్ జరిపి ఫిర్యాదికి న్యాయం చేయాలని బూర్జువలస ఎస్ఐ ని ఆదేశించారు.

నెల్లిమర్ల, గాంధీనగర్ కోలనీకి చెందిన ఇంకోబాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఆమె భర్త, అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా హింసించి, ప్రస్తుతం అమెను తన పుట్టింటిలో వదిలివేసారని, తన చదువుకు సంబంధించిన సర్టిఫికేట్లు తన భర్త వద్దే ఉంచుకొని, తిరిగి ఇవ్వడం లేదని, తన భర్తపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ రెంస్పాడెంట్ ను పిలిపించి కౌన్సిలింగ్ జరిపి, చట్ట ప్రకారం ఫిర్యాదికి న్యాయంచేయాలని నెల్లిమర్ల ఎస్ఐని ఆదేశించారు.

స్థలం అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నారు

విశాఖపట్నం, ఎస్ఏడి, అంబేద్కర్ నగర్ కు చెందిన  ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తనకు విజయనగరం, గోకపేటలో వారసత్వంగా తనకు సంక్రమించిన 115 గజాలస్థలంను, చుట్టు ప్రక్కల నివాసం ఉన్న వారు అమ్మేయాలని దౌర్జన్యం చేస్తున్నారని, వారిపై చర్య తీసుకొన తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాంటెంట్స్ ని పిలిపించి, డాక్యుమెంట్లు పరిశీలించి, వారి పై చట్టప్రకారం చర్య తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వ‌న్ టౌన్ సీఐని ఆదేశించారు.

బొండపల్లి మండలం, యడ్లపాలెం గ్రామాని  చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరంకు చెందిన ఒకతను తన యొక్క ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు క్లోజ్ చేయమని ఇవ్వగా అతను ఆ కార్డు నుండి 54వేలు వాడుకొని, తనకు తిరిగి చెల్లించడం లేదని, తన డబ్బులు తనకి ఇప్పించి, అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ  చట్టపరంగా చర్య తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐ వాసుదేవ్ ని ఆదేశించారు.

ఆస్థి తీసుకున్నాను.. నన్ను నా భర్యను వదిలేశారు…

పూసపాటిరేగ మండలం, రోలుచప్పిడి కి ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తూ తనను, తన భార్యను వృద్ధాప్యంలో తన కుమారుడు, కోడలు తమ బాగోగులు చూడకుండా వారి ఆస్థిని అనుభవిస్తున్నారని వారిపై చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్య తీసువాలని భోగాపురం సీఐను ఆదేశించారు.

ఈ”స్పందన” కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, సీఐలు డా.బి. వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, డిసిఆర్ బి ఎస్ఐలు నీలకంఠం, సూర్యారావు, తారకేశ్వరరావు  ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

సింహ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు….

Satyam NEWS

వర్షం

Satyam NEWS

న్యూ లైన్:16న కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment