38.2 C
Hyderabad
April 29, 2024 21: 33 PM
Slider గుంటూరు

కార్తీక మాసం సందర్భంగా సత్తెనపల్లి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్

#sattenapally

కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ కుమార్ తెలిపారు. ప్రతి కార్తీక సోమవారం ఒకే రోజు పంచారామాల దర్శనం కోసం సత్తెనపల్లి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. సామర్లకోట (కొమరా రాము),ద్రాక్షారామం (భీమారామం),పాలకొల్లు (క్షీరా రామం), భీమవరం (సోమారామం), అమరావతి(అమరారామ) దర్శనం చేయించి తిరిగి వస్తారు. దీని కోసం ఎక్స్ ప్రెస్ బస్ చార్జీ 910 రూపాయలు, అల్ట్రా డీలక్స్ 1160 రూపాయలు గా నిర్ణయించారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం సత్తెనపల్లి బస్టాండ్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరుతాయి.

సత్తెనపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని విజయకుమార్ తెలిపారు. అదేవిధంగా ప్రతి ఆదివారం, సోమవారం శ్రీశైలం వెళ్ళేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి నుండి అరుణాచలం(గిరి ప్రదక్షిణ) కు నవంబరు ఐదవ తేదీన రాత్రి 9 గంటలకు బస్సును ఏర్పాటుచే చేసామని ఆయన తెలిపారు. ఈ బస్సు 5వ తారీఖు రాత్రి 9 గంటలకు బయలుదేరి కాళహస్తి ,కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదగా ఏడవ తేదీ జరిగే కార్తీక పౌర్ణమి గిరి ప్రదర్శన వేడుకలు చూసుకొని అనంతరం 8వ తేదీన బయలుదేరి గమ్యస్థానానికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక ప్రయాణానికి ఔత్సాహికులు డిపో వద్దనే కాకుండా పంచారామాలు, శ్రీశైలం మరియు గిరి ప్రదర్శనకు ఆన్లైన్ టికెట్ల విక్రయ కేంద్రాల్లో ముందస్తు బుకింగ్ చేసుకో వచ్చు.

Related posts

కోమటిరెడ్డి తీరుపై అధికారుల తీవ్ర నిరసన

Satyam NEWS

అత్యంత వైభవంగా ముగిసిన రజకుల ఆరాధ్య దేవతా ప్రతిష్ఠా మహోత్సవం

Satyam NEWS

సిఎం సొంత జిల్లాలో అడ్డులేని ఇసుక అక్రమ రవాణా

Satyam NEWS

Leave a Comment