29.7 C
Hyderabad
May 1, 2024 03: 08 AM
Slider ఆధ్యాత్మికం

విద్య‌ల న‌గ‌రంలో న‌డియాడిన వ్యాస మ‌హ‌ర్షి….!(రెండవ భాగం)

#vyasanarayanamettu2

అది 1800 సంవ‌త్స‌రం…అప్పట్లో రాజుల హాయంలో నే ఉండేవి విజ‌య‌న‌గ‌రం.పూస‌పాటివంశీయుల హాయంలో విజ‌య‌న‌గ‌రంలో నిర్మించిన కోట లో పాల‌న కొన‌సాగేద‌ని నాటి పూర్వీకులు…కొన్ని గ్రంధాల‌లో లిఖించారు కూడ‌.ఆ సమ‌యంలోనే పూల్ భాగ్  అనే ప్రాంతం  వ‌ద్ద‌…ఉన్న మెట్ట‌పై  వ్యాస భ‌గ‌వానులు సంచ‌రించే వార‌ని…నాటి స్థ‌ల పురాణంలో కొనియాడ‌బ‌డింది కూడ‌.

దాన్ని గుర్తించిన నాటి పూస‌పాటివంశీయులు… ఆదే  మెట్ట‌కు వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌గా పేరు పెట్టి….విజ‌య‌న‌గ‌రంతో పాటు అటు సిక్కోలు,ఇటు ఉక్కు న‌గ‌రం నుంచీ ఇలా తూర్పు గోదావ‌రి నుంచీ ప‌శ్చిమ గోదావ‌రిలో ఉండే వేలివెన్ను వ‌ర‌కు విజ‌య‌నగ‌రంలో ఉండే వ్యాస‌నారాయ‌ణ మెట్ట గురించి ప్రాచుర్యం పొందింది కూడ‌.కాల‌క్ర‌మేన రాజుల కాలం పోయి…ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ రావ‌డంతో పాలక వ‌ర్గం ఏర్ప‌డి ప్ర‌జ‌ల చేత‌,ప్ర‌జ‌ల కొర‌కు ఎన్నికైన  ప్ర‌భుత్వం ఏర్ప‌డం…తద్వారా ప‌రిపాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లు రావ‌డంతో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ క్ర‌మంలోనే అల‌నాటి రాజుల కాలంలో ప్ర‌సిద్ది గాంచిన కోట‌, కోట గుమ్మం,బొబ్బిలి కోట,రాజాంలోని తాండ్ర పాపారాయుడు ఇలా కొన్ని కొన్ని చారిత్ర‌క  ప్ర‌దేశాల‌తో ఆయా ప్రాంతాలను అప్ప‌టి నుంచీ ఎన్నికైన ప్ర‌భుత్వాలు త‌మ‌,త‌మ స‌భ‌ల‌లో ప్ర‌జాప్ర‌తినిధులు కొరినట్టుగా మార్ప‌లు అభివృద్ది ప‌నులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ వేగంలోనే.. విద్య‌ల‌నగ‌రంగా ఖ్యాతి పొందిన విజ‌య‌న‌గ‌రంలో వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను అభివృద్దిని కాస్త వెన‌క్కు నెట్టారు.

కానీ న‌గ‌రంలో  ఎన్నో వంద‌ల ఏళ్ల నాటి కోట‌,కుమిలి వ‌ద్ద ఉన్న ప్రాచీన క‌ట్ట‌డాల‌ను మాత్ర‌మే గుర్తించిన నాటి పాల‌క‌ల‌కు వాటిని మాత్ర‌మే అభివృద్ది ప‌రుస్తూ ముందుకెళుతున్నారే త‌ప్ప‌..ఆది గురువు వేద వ్యాసుడు న‌డియాడిన వ్యాస‌నారాయ‌ణ మెట్ట అభివృద్దిని మాత్రం ప‌క్క‌న పెట్టారు. ప‌ర్య‌వ‌స‌నంగా అప్ప‌టి నుంచీ ఆ మెట్ట ప్రాంతం అంతా ఓ అడవిలా మారింది.

వ్యాసనారాయణ మెట్టుపై సత్యంన్యూస్.నెట్ పరిశోధనాత్మక వ్యాసంలో రెండో భాగం

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఇడుపులపాయలో విద్యార్ధి ఆకస్మిక మృతి

Bhavani

పుకార్లు కొట్టిపారేసిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

Satyam NEWS

కడపలో ల్యాబ్ టెక్నీషియన్ ల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment