29.7 C
Hyderabad
April 29, 2024 07: 09 AM
Slider ఆధ్యాత్మికం

అట‌వీ ప్రాంతం నుంచి వ్యాస‌నారాయ‌ణ మెట్ట ఎప్పుడు విముక్తి పొందిందో తెలుసా..?

#vyasanarayanametta3

స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల క్రితం అంటే దాదాపు 1999 ఏడాదిలో ఏపీ రాష్ట్రంలోని ఉత్త‌రాంధ్ర‌లో బాగా వెన‌క‌బ‌డిన‌జిల్లాలో అప‌ఖ్యాతిమూట‌క‌ట్టుకున్న విజ‌య‌న‌గ‌రం పుర‌పాల‌క‌సంఘంలో వ్యాస‌నారాయ‌ణ మెట్ట ఒకటి ఉంద‌న్న విష‌యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియ చేసింది..నాటి కాలంలో సంచ‌ల‌న ప‌త్రిక‌గా పేరు గ‌డించిన వార్త దిన ప‌త్రిక‌.

ఆ ప‌త్రిక చీఫ్ ఎడిట‌ర్ సీహెచ్వీ ర‌మ‌ణ మూర్తి…విశాఖ డెస్క్ ఇంచార్జ్ సాగ‌ర్, ఇలా కొంత మంది…విజయ‌న‌గ‌రం టౌన్ రిపోర్ట‌ర్ రాసిన క‌థ‌నం పోటోల‌తో త్రిబుల్ కాలం  వార్త‌ను రాయ‌డంతో  అప్ప‌ట్లో ఆ వార్త ప‌త్రిక పెను సంచ‌నం సృష్టించింది.

ఆ స‌మ‌యంలోనే ద‌ట్ట‌మైన ఓ అడ‌విలో ఉన్నవ్యాసనారాయ‌ణ మెట్ట ఉంద‌న్న విష‌యం…పుర‌పాల‌క సంఘానికి తెలియ వ‌చ్చింది. క‌థ‌నం తో అప్ప‌టి పుర‌పాల‌క సంఘం అధికారుల‌తో చ‌ల‌నం వ‌చ్చి…వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను గుర్తించడంతో అభివృద్దికి బీజం నాట‌డంమైంది.గ‌డ‌చిన ఈ రెండు ద‌శాబ్దాలలో ప్రభుత్వాలు మారి పాలించే నేత‌లు మార‌డంతో అబివృద్ది కి కాస్త అడ్డంకుల ఏర్ప‌డ్డాయి.

పురపాల‌క సంఘం కాస్త న‌గ‌రపాల‌క స్థాయిగా అడుగులువేసినా…వ్యాస‌నారాయ‌ణ మెట్ట అబివృద్ది మాత్రం ఒక్కంటే ఒక్క అడుగు ముందుకు ప‌డ‌లేదు. ప‌ర్య‌వ‌స‌నంగా విజ‌య‌న‌గ‌రానికి తూర్పున ఉండ‌టం అదీ  కుమిలి వెళ్లే దారిలోనూ కొండ‌కు ద‌గ్గ‌ర ఉండ‌టంతో నిర్జన ప్ర‌దేశం కావ‌డంతో చీకటి ప‌డితే అసాంఘీక కార్య‌క్ర‌మాల‌కు అడ్డ‌గా మారింది. దీంతో జూదం, మందు,అమ్మాయిల‌తో అస‌భ్య ప్ర‌ద‌ర్శ‌న‌…వంటి చ‌ర్య‌ల‌కు కేంద్రంగా మారింది.

అయితే 2018 లో విజ‌య‌న‌గ‌రం పుర‌పాల‌క సంఘం కాస్త విజ‌య‌న‌గ‌ర‌పాల‌క సంస్థ గా గెజిట్ నోటిఫేక‌ష‌న్ రావ‌డంతో విజ‌య‌న‌గ‌రంలో చారిత్ర‌క ప్ర‌దేశాలు మ‌రింత‌గా అభివృద్ది చెందేందుకు అడుగులు ప‌డ్డాయి.ఈ క్ర‌మంలోనే  మొత్తం 41 ఎక‌రాలున్న వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను…ప‌ర్యాట‌క శాఖ ప‌రిధిలోకి తేవాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం కూడా నిర్ణ‌యం తీసుకుంది.

అ స‌మ‌యంలో హైద‌రాబాద్ లో మాదిరిగానే ఏపీ రాష్ట్ర మంత‌టా శిల్పారామాలు ఏర్పాటు జ‌రిగింది. దీంతో విజ‌య‌న‌గ‌రంలో కూడా ఓ వ్యాస‌నారాయ‌మెట్ట స‌మీపంలో ఓ శిల్పారామంను ఏర్పాటు చేసారు…నాటి టీడీపీ ప్ర‌భుత్వం. ఇక  దాంతో పాటు వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను అబివృద్ది చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కాస్త అట‌కెక్కింది. కాని న‌గ‌రంలో ప్ర‌ముఖ స్వ‌చ్చంద సంస్త స్మార్క్ సొసైటీ..వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను అబివృద్ది ప‌రిచేందుకు ముందుకు వ‌చ్చింది.

( ఏ విధంగా స్పార్క్ సొసైటీ అభివృద్ది ప‌రిచిందో త‌రువాయి భాగంలో)

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ భ్రమ వదలండి

Satyam NEWS

గృహలక్ష్మీ యల్పీజి నూతన కనెక్షన్ పథకం ప్రారంభం

Satyam NEWS

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెడుతున్నారు

Satyam NEWS

Leave a Comment