38.2 C
Hyderabad
April 29, 2024 19: 13 PM
Slider ప్రపంచం

భారత్ 50 కోట్ల డాలర్ల అప్పు ఇవ్వాలని శ్రీలంక వేడుకోలు

ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి, కూరగాయలకు దిగుమతులపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది.

ఇపుడు ఆదుకోవాలని భారత్​ను శ్రీలంక అర్థిస్తోంది. ఏకంగా 50 కోట్ల డాలర్లు అప్పుగా ఇవ్వాలంటూ భారత్​ ను వేడుకుంటోంది. దేశ ప్రభుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సీలోన్‌, పీపుల్స్ బ్యాంక్‌ వంటి అనేక బ్యాంకులకు భారీగా బాకీ పడింది. ఈ బాంకులకు సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ సుమారు 330 కోట్ల డాల‌ర్లు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పులను తీర్చడానికి భారత్‌ సాయం అర్దిస్తోంది.

Related posts

బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Satyam NEWS

కల్లుగీత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు

Satyam NEWS

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment