40.2 C
Hyderabad
April 29, 2024 16: 10 PM
Slider ముఖ్యంశాలు

సీబీఐటిలో Startup20X ఫస్ట్ చాప్టర్ విజయవంతం

#cbitcollege

ఆవిష్కర్తలను, ఔత్సాహికులను, పారిశ్రామికవేత్తలను ఒక చోట చేర్చేందుకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ చొరవతో ప్రారంభించిన “Startup20X” ఫస్ట్ చాప్టర్ కు నేడు ACIC-CBIT ఆతిథ్యమిచ్చింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ చింతన్ వైష్ణవ్ స్టర్టరప్ 20 ఎక్స్ ప్రాధామ్యతలను వివరించారు. “సామాజిక మార్పు నడిపించే వ్యవస్థాపకులు” అనే థీమ్‌పై పాల్గొన్న 4 స్టార్టప్ వ్యవస్థాపకులు తమ స్టార్టప్ జర్నీని సమావేశంలో పంచుకున్నారు.

మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోసె పిండి ఫార్ములాను రూపొందించిన హైదరాబాద్ కు చెందిన ఆటోక్రసీ మెషినరీ సహ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు, ఇండిక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, CEO సుప్రియ గట్టెం, ఉత్తుంగ వెంచర్స్ వ్యవస్థాపకుడు ప్రణవ్ హెబ్బార్, “ఫైండ్ హోప్” వ్యవస్థాపకుడు తరుణ్ సాయి (మెటల్ హెల్త్ స్టార్టప్)లు తమ అనుభవాలను పంచుకోవడం పలువురికి ఆసక్తి కలిగించింది.

పరిశ్రమ నాయకులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, దూరదృష్టి గలవారు, విద్యావేత్తలు, ఇంక్యుబేషన్ నిపుణులు, మహిళలు, యువత, కళాకారులు లాంటి వారిని ఒక చోట చేర్చి వారికి ఉత్తమ అభ్యాసాలను, అనుభవాలను చర్చించడానికి Startup20X ను నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ CBIT, ప్రిన్సిపల్ CBIT మంగ్లేష్ యాదవ్, ప్రోగ్రాం డైరెక్టర్, ACIC డాక్టర్ ఉమాకాంత్ చౌదరి డైరెక్టర్ I&I CBIT, ACIC-CBIT CEO అన్నీ విజయ తదితరులు తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ప్రదర్శన తిలకించారు.

Related posts

సరిహద్దులో ఉద్రిక్తత పెంచడమే చైనా ఉద్దేశ్యం

Satyam NEWS

గాంధీభవన్ లో జవహర్ లాన్ నెహ్రూకు ఘన నివాళి

Satyam NEWS

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలి

Bhavani

Leave a Comment