38.2 C
Hyderabad
April 29, 2024 21: 44 PM
Slider కడప

రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు కరోనా వాహకాలు

#Kadapa TDP

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న వారం రోజుల కార్యాచరణలో భాగంగా రెండవ రోజు కడప అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ వి.ఎస్.అమీర్ బాబు  తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కరోనా వైరస్ వ్యాప్తి చేసే వాహకాల లాగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.

మార్చి నెల 22వ తారీఖు వరకు రాష్ట్రంలో కేవలం 5 కరోనా పాజిటీవ్ కేసులుంటే నిన్నటికి 58,668 కి చేరాయి. నిన్న ఒక్క రోజే 6 వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయంటే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదని సామాన్యులకు సైతం అర్థమవుతోందన్నారు.

ప్రజల ప్రాణాలకు విలువ లేదా?

కొత్త మంత్రులను నియమించేందుకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల ప్రాణాలకెందుకు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ప్యారాసిటీమల్ ట్యాబ్ లెట్ వేసుకొని, బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే పోతుందని కరోనాకు తేలిక భావంతో చెప్పడం వల్ల ప్రజలు కూడా కరోనాను అంతే తేలిక భావంతో చూడటం వల్ల నేడు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం మాస్కులు ధరించకపోవడం ప్రజలకు ఏం సందేశం ఇస్తారని అడుగుతున్నానన్నారు. డబ్బు మీద ఉండే వ్యామోహంలో వైన్ షాపులు తెరిచి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలైన పాఠశాలలు, కాలేజీలు, సినిమా థియేటర్లు, అన్ని మతాల ప్రార్ధనా స్థలాలను కరోనా భయంతో మూసివేశారని అన్నారు.

అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలను తెరిచి యథేచ్ఛగా కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి  తన పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారిగా మద్యపాన నిషేధం అమలు చ్చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.

మద్యం దుకాణాలు లేకపోతే వైరస్ ఆగింది

కరోనా లాక్ డౌన్ అమలైన తర్వాత సుమారుగా రెండున్నర నెలలపాటు మద్యం దుకాణాలను మూసివేయడం వల్ల మద్యం ప్రియులు కూడా వాటి జోలికి పోకుండా ఉన్నారు. కొంతమంది కరోనా పుణ్యమా అని మద్యాన్ని మానేశారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే మద్యం త్రాగడానికి మద్యం దుకాణాలను తెరిచి, ప్రజలు గుంపులు గుంపులుగా తెల్లవారంగానే వచ్చి మద్యం దుకాణాల ముందు క్యూ లైన్లలో నిలబడేట్టు చేసిందన్నారు.

మద్యం దుకాణాల వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ దావానలంలా విస్తరించే పరిస్థితి తెచ్చారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఒక ప్రక్క మద్యం నియంత్రణ అని చెబుతూ మరో వైపు జే-ట్యాక్స్ రూపంలో మద్యం ధరలను పెంచేసి, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను అమ్ముతూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని ప్రజలే మాట్లాడుకుంటున్నారన్నారు.

ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కొంటున్నారని మహిళలు చర్చించుకుంటున్నారన్నారు. ఇప్పుడు తాము మద్యం దుకాణాల పరిస్థితి చూసేందుకు వెళితే, మద్యం దుకాణాల వద్ద జాతరను తలపిస్తుందన్నారు. మందు ప్రియులు కరోనా నిబంధనలైన సామాజిక, భౌతిక దూరలను పాటించకుండా, మాస్కులు కూడా ధరించకుండా ఒకరి మీద ఒకరు పడుతూ… కొన్ని కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లలో నిలబడి, కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు ప్రభుత్వమే కారకులవుతోందని అన్నారు.

కడప జిల్లాలో వైరస్ తీవ్రతరం

కడపజిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రత్యేకించి కడప నగరంలోని ప్రజలు కరోనా వైరస్ ఏ మూలన పొంచి వుందో అని తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంభయంగా బ్రతకాల్సిన పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారన్నారు.

ఈ వారం రోజుల్లో కడప నగరంలో సుమారుగా పది మంది మరణించారు. వీళ్ళల్లో కొందరేమో కరోనాతో మరణిస్తే, మరికొందరేమో ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో మరణించారని అన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎలా మరణించారో నిర్ధారణ అవుతుంది.

దానివల్ల వారి కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండేందుకు వీలు పడుతుందన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి కరోనా వాహకాలుగా పనిచేస్తున్న మద్యం దుకాణాలను మూసి వేసి ప్రజలు కరోనా బారీనా పడకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ సమావేశంలో మాజీ జీ.పీ. గుఱ్ఱప్ప, బాలదాసు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిబ్రవరి 1న శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి తై అమావాస్య అభిషేకం

Satyam NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Murali Krishna

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

Leave a Comment