29.7 C
Hyderabad
May 1, 2024 08: 31 AM
Slider మెదక్

సామాజిక మాధ్యమాల్లో చెడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

#siddipetpolice

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారికి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ రాజకీయం గాను, కుల, మత, ప్రాంతీయ, రాజ్యాంగ స్ఫూర్తికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు, జాతీయ సమగ్రతకు, భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు  ఉంటాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.

సామాజిక మధ్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే  వాళ్లపైన ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్  లలో విద్వేషపూరిత అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన మరియు ఫోటోలు మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నేరాలు చేసే వారిపై  సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై  కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూనే ఉంటారు. ఈ తరహా నేరలకు పాల్పడే వారిని వెంటనే పట్టుకొని శిక్షించేందుకు గాను జిల్లాలో ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా ” Social Media Monitoring Cell ” నూ ఏర్పాటు చేయడం జరిగింది అందులో అధికారులు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అని ఆమె వెల్లడించారు.

Related posts

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani

విద్య‌ల న‌గ‌రంలో న‌డియాడిన వ్యాస మ‌హ‌ర్షి….!(రెండవ భాగం)

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

Satyam NEWS

Leave a Comment