పర్యావరణానికి పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ పై కఠిన నియంత్రణ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరీ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పెద్ద ఎత్తున యుద్ధమే ప్రకటిస్తున్నది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచన మేరకు ఇప్పటికే ఒక పటిష్టమైన కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని, దీన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ముఖ్యంగా దైనందిన జీవితంలో భాగంగా మారిన 12 రకా ప్లాస్టిక్ ఉత్పత్తును పూర్తిగా నిషేధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.
previous post
next post