29.7 C
Hyderabad
May 1, 2024 04: 15 AM
Slider ముఖ్యంశాలు

సైబర్ నేరాల కట్టడికి ఆధునికీకరణ దశలో అడుగులు

#cyber crimes

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలకు నూతన పరిజ్ఞాన ప్రయోజనాలను వివరించి చైతన్య పర్చాలను రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర,ఇతర సంబంధిత పోలీసు అధికారులతో కలసి స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల బాధితులు వెంటనే NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో వివరాలు నమోదు చేస్తే బాధితులకు నష్టం వాటిల్లకుండా పోయిన సొత్తును తిరిగి రాబట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు,సైబర్ బాధితులు డయల్-100 కు ఫోన్ చేసి సైబర్ కేసు అని చెప్పినచో, ఆటోమేటిక్ గా డయల్- 112 లో ఫిర్యాదు నమోదు చేసుకుని బాధితులకు న్యాయం చేయడానికి ఆస్కారం వుంటుందని తెలిపారు.

ఇటీవలే సైబర్ నేరానికి గురై ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు,ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, AHTU, పోలీస్ కళాజాతా బృందాలచే అన్ని మండల, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు, సైబర్ మోసగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

వారు ఎన్ని విధాల మోసం చేయడానికి ప్రయత్నించినా, పిన్ నెంబర్, ఓటిపి, పాస్ వర్డ్, సివివి,అకౌంట్ నెంబర్, ఏటిఎం, కార్డు నెంబర్,ఎలాంటి KYC వివరాలు తెలియచేయవద్దని కోరారు, జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ లలో కంప్యూటర్ జ్ఞానం కల్గిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంపిక చేసి సైబర్ నేరాలపై హైదరాబాద్ లో ఆధునిక శిక్షణ అందించి సైబర్ వారియర్లుగా నియమించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ సీఐ ఈ చంద్రమౌళి, పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి మొహ్మద్ యూనిస్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ సుధాకర్ రావు, గడికొప్పుల వేణు, కమ్యూనికేషన్ ఎస్సై వి. గంగా సాగర్, డిసిఆర్బి ఎస్సై ఎం ఏ హకీం, కంప్యూటర్ విభాగం సిబ్బంది మొహ్మద్ రియాజ్, సాహరే కిషోర్,కే. నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరో అధునాతన స్టేడియం

Murali Krishna

అకాల వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

వెంకటేశుడికి భక్తులకు మధ్యలో తిరుమల దేవస్థానం

Satyam NEWS

Leave a Comment