38.2 C
Hyderabad
April 28, 2024 23: 01 PM
Slider ముఖ్యంశాలు

కరోనా చికిత్సకు ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు

#anilsinghal

కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.

పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లు టెస్టులు చేయగా, 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు.

గతంలో కంటే నేడు తక్కువ పాజిటివ్ రేటు నమోదయ్యిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులపై పెనాల్టీ విధించామన్నారు. ఇటీవలే కరోనా వైద్య చికిత్సలకు అందజేసే ఫీజుల రేంటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే ఏపీలో పెంచిన ఫీజులు రీజనబుల్ గా నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకు కూడా పెంచిన ఫీజులనే చెల్లిస్తున్నామన్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే బిల్లులను నోడల్ అధికారులు, వారి బృందాలు మానటరింగ్ చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.

కరోనా థర్డ్ వేవ్ పై మీడియాలో నిపుణులు నుంచి వస్తున్న సూచనలను పరిగణలోనికి తీసుకుని సీనియర్ అధికారులతో ఒక కమిటీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించాలని ఆదేశించారన్నారు.

ఆ కమిటీ కరోనా థర్డ్ వేవ్ వస్తే…ఎదుర్కొనడానికి అవసరమైన ఐసీయూ బెడ్లు ఏర్పాటుతో పాటు మందుల కొనుగోలుపై వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వనుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.

Related posts

అన్నమయ్య జిల్లా లో ఒక్క ఇసుక క్వారీకి కూడా అనుమతి లేదు

Satyam NEWS

ముగ్గురు సోదరులను కాల్చి చంపిన వ్యక్తి

Satyam NEWS

కేంద్ర మంత్రిగా అరవింద్ ధర్మపురి?

Bhavani

Leave a Comment