ఏరువాక చేను చెలక పంట పొలాలపై మక్కువ ఎక్కువ పెంచుకుని మన ఉనికి వ్యవసాయమని చాటి చెబుతున్నారు ములుగు జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. సెలవు దొరికితే చాలు వ్యవసాయ పనులకు హాజరయి ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా అబ్బాపూర్ శ్రీరాముల పల్లి గ్రామానికి చెందిన రాస రవీందర్ అనిత దంపతుల వరి పొలంలో ఆమె నేడు నాటు వేసారు. కూలీలతో కలిసి భోజనం చేశారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ వ్యవసాయం నామోషీ కాదని ఈ దేశానికి వెన్నుముక రైతు అని సమస్త మానవాళికికి అన్నం పెట్టేది రైతన్న అని ఆమె అన్నారు.