38.2 C
Hyderabad
April 28, 2024 21: 28 PM
Slider గుంటూరు

సిఎం గారూ సబ్సిడీ ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి సారూ

#MIMNarasaraopet

సబ్సిడీ పై ఉల్లిపాయలు సరఫరా చేస్తామని, రైతు బజారులలో అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించి నేటికీ 10 రోజులు అవుతున్నా ఎక్కడా వాటి జాడే కనిపించడం లేదని ఎంఐఎం పార్టీ విమర్శించింది.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషయంపై మార్కెట్ యార్డ్ కార్యదర్శిరిని కలసి ఎంఐఎం నేతలు వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా ఎంఐఎం నాయకుడు మస్తాన్ వలీ మాట్లాడుతూ నరసరావుపేట లో ఎక్కడా ప్రభుత్వం అందించే ఉల్లిపాయల అమ్మకాలు జరగటం లేదని తెలిపారు.

ఈరోజు నరసరావుపేట లోని అన్ని రైతు బజారులు పరిశీలించామని ఆయన తెలిపారు. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలి అని పదే పదే, చెప్తున్నా ఇక్కడ వున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

అధికారులు చర్యలు తీసుకోకపోవటం అనుమానాలకు అవకాశం ఇస్తుందని ఆయన తెలిపారు. ఇక్కడ వున్న వ్యవసాయ అధికారులు స్థానిక ఉల్లి వ్యాపారస్తులతో ఏమైనా లాలూచి పడ్డారా అని పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారని మస్తాన్ వలీ తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎంఐఎం నాయకులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

Satyam NEWS

వనపర్తిలో సారా తయారీకి వాడే నల్ల బెల్లం సీజ్

Satyam NEWS

తుమ్మల మంచి నాయకుడు.. పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం

Bhavani

Leave a Comment