గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ఆయనకు రెండు మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటు, మంచి పనితీరుతో లక్ష్యాలను చేరుకోగలిగితే 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ అవార్డు లభించనుంది.
అంతేకాకుండా ఆల్ఫాబెట్ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్ డాలర్ల విలువగల షేర్లు అదనపు బోనస్‌గా లభించనున్నాయి. అయితే.. పనితీరును బట్టి షేర్లను బోనస్‌గా ఇవ్వడం కాలిఫోర్నియాలో నెలకొన్న ఆల్ఫాబెట్ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి.