40.2 C
Hyderabad
April 28, 2024 15: 24 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి

#CITUHujurnagar

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్రధారి, భారతదేశ ప్రథమ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అందరివాడని  ప్రతి ఒక్కరూ సుందరయ్య ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ, వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య కాలంలోని రాజకీయాలు ఎలా ఉన్నాయి? 76 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర పిదప గత ఆరు సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయి? అని మనం ఒకమారు గుర్తు చేసుకోవాలని, ప్రస్తుతం దేశంలో BJP పాలనలో పెడ ధోరణులతో,మతతత్వ లక్షణాలతో,భారతదేశ ప్రజలు సగానికి పైగా నడిరోడ్డు మీద  జీవిస్తున్నారని,దీనికి కారణాలు పెద్దనోట్ల రద్దు వల్ల, కాశ్మీర్ చట్టాల సవరణ వల్ల, జి ఎస్ టి తో పరిశ్రమలు మూత వలన, కరోనాతో లాక్ డౌన్ ల వలన,మూడు వ్యవసాయ చట్టాలు చేయడంతో ఢిల్లీ సరిహద్దులో కొన్ని రాష్ట్రాల రైతులు నడి వీధిలో బతుకు పోరాటాల వలన,పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరల పెంపు వల్ల, ఈ రకంగా అనేక వివిధ కారణాలతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంటే మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు గుండెబోయిన వెంకన్న, చింతకాయల పర్వతాలు, దుర్గారావు, కనకయ్య, కోటమ్మ, గోపమ్మ, మున్ని, పద్మ, గోవిందమ్మ శారద ములకలపల్లి శీను రామారావు, నరసింహారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

కర్నాటకలో విద్వేషంపై ‘ప్రేమ’ గెలిచింది

Bhavani

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Satyam NEWS

Leave a Comment