39.2 C
Hyderabad
April 28, 2024 13: 36 PM
Slider ముఖ్యంశాలు

పల్లె ప్రగతి పురోగతి సంతృప్తికరంగా ఉంది

#Someshkumar IAS

రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పల్లెలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పై అవగాహన కోసం  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ మూడు జిల్లాలలో ని ఆరు గ్రామాలలో శుక్రవారం ఆకస్మిక తనిఖీని నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా లోని సదాశివపేట మండలంలోని తిర్మన్ పల్లి, కామారెడ్డి మండలం లోని గర్గుల్ ,  సంగారెడ్డి జిల్లాలో  కంది మండలం ఎద్దుమైలారం, కొండాపూర్ మండలం గుంతపల్లి, వికారాబాద్ జిల్లాలో ని వికారాబాద్ మండలం పెండ్లిమడుగు, నవాబుపేట మండలం దాతాపూర్ గ్రామాలలో పర్వటించారు.

జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో గ్రామాలను నిర్ణయించి, పర్యటించామని అన్నారు. ఆకస్మిక తనిఖీ చేసినప్పటికి గ్రామాలలో పారిశుద్ద్య కార్యక్రమాలు, మంచిగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గమనించారు.

తర్వాత వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షడ్లు నిర్మాణం కొన్ని చోట్ల పూర్తి కావడంతో పాటు మరి కొన్ని వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ లో మొక్కలు నాటడం కోసం నర్సరీలు సిద్ధం చేయడం ట్రాలీ ట్రాక్టర్లు చెత్తను తరలించడానికి హరితహారం మొక్కలకు నీరు అందించడానికి సిద్దంగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతి పురోగతి పట్ల ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేస్తూ వర్షా కాలంలో వచ్చే సిజనల్ వ్యాధుల వల్ల సవాళ్లను ఎదుర్కోడానికి పూర్తి స్థాయిలో సిద్దం కావాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పల్లె ప్రగతి ద్వారా వచ్చే రెండు సంవత్సరాలలో హరితహారంతో గుణ్మకమైన మార్పు వస్తుందని ప్రధాన కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట పంచాయతీ రాజ్ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ రఘునందన్ రావు ఉన్నారు.

Related posts

నిజాయితీ, నిరాడంబరతకు నిలువుటద్దం వావిలాల

Satyam NEWS

సంచలనం సృష్టించిన కొమ్మినేని…కోర్టు నోటీసు

Satyam NEWS

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment