38.2 C
Hyderabad
May 1, 2024 21: 03 PM
Slider ప్రత్యేకం

నిజాయితీ, నిరాడంబరతకు నిలువుటద్దం వావిలాల

#vavilala

సాధారణ జీవన విధానంతో అసాధారణ ఖ్యాతిగాంచిన వావిలాల గోపాలకృష్ణయ్య సేవ, త్యాగం, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.

శుక్రవారం సత్తెనపల్లిలో వావిలాల గోపాలకృష్ణయ్య 116వ జయంతిని పురస్కరించుకొని వావిలాల మెమోరియల్ పార్క్ లో ఆయన ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్ అధ్యక్షత వహించారు.ఎంపి తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ , వైకాపా రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజ నారాయణలు ఉన్నారు.

ఈ సందర్భంగా లావు మాట్లాడుతూ వావిలాల తో మా కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. నా చిన్నతనంలో ఆయన సాధారణ వస్త్రధారణతో చేతి సంచి తో మా నాన్నగారి దగ్గరకు వచ్చి పేద పిల్లలను చదివించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈతరం రాజకీయ నేతలకు అట్టహాసం,అంగబలం లేకపోతే మా కంటే ముందు అభిమానులే ఒప్పుకోలేని, సహించలేని మానసిక ఆలోచన ధోరణికి మనం దిగజారిపోయామన్నారు.

ఆయన నిరాడంబరత, నిజాయితీ ఇతర నేతలకు కాస్త కష్టమే అన్నారు. తెలుగు భాషకు వెలుగు నింపడంలో, నాగార్జునసాగర్ నిర్మాణంలో, మద్యనిషేధ కార్యక్రమాలలో ఆయన చురుకైన పాత్ర పోషించారన్నారు. వావిలాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఒకటి రెండు రోజులకే సరిపెట్టకుండా వారం రోజుల పాటు ప్రత్యేకంగా రూపొందించుకోవడం స్థానిక నాయకుల బాధ్యతన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, ఉపాధ్యాయులను, ఇతర వర్గాలను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. ఓపెన్ థియేటర్ ను వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ కు సూచించారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా సేవలు అందించారని అయితే.. వావిలాల గోపాల కృష్ణయ్య కుఉన్న గుర్తింపు, గౌరవం ..ఆ ఖ్యాతి వేరన్నారు. ఆయన నడచిన నేలపై మేము సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు .  స్వాతంత్రోద్యమ పోరాటం తోపాటు అనేక సంఘ సంస్కరణల కోసం అవిరళ కృషి చేశారని గుర్తు చేశారు.

ప్రతి ఏడాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి, వర్ధంతి వేడుకలను   ఘనంగా నిర్వహించడం ద్వారా వావిలాల నిస్వార్థ సేవలు, త్యాగాలు, పోరాటాలను నేటితరానికి అందించడమే లక్ష్యమన్నారు. ఈ పరుగుల జీవితంలో వావిలాల లాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను గుర్తుచేసుకోవటం మన బాధ్యత అన్నారు.

వావిలాల ఘాట్ నిరాదరణకు గురైన ప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుద్ధిచేసి తగిన గౌరవం కల్పించామన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వం మేల్కొందని గుర్తు చేశారు. ప్రజలు మెచ్చుకునేలా పనులు నిర్వహిస్తామని ..వారు నొచ్చుకుంటే ఏమౌతుందో గత ప్రభుత్వానికి పట్టిన గతిని గమనించామన్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్యతో ప్రత్యక్షంగా అనుబంధం ఉందన్నారు. బక్కపలక దేహంతో చురుగ్గా ఉండటానికి ఆయన మితాఆహారమే ఆరోగ్య రహస్యం అన్నారు. దేశ పురోగతి, అభివృద్ధి.. రోడ్ల విస్తరణ, భవనాల నిర్మాణం.. వంటి కార్యక్రమంలో ఉండదని ప్రజల మానసిక పరిపక్వత తో కూడిన ఆలోచనా ధోరణిలోనే ఉంటుందన్నారు.వావిలాల చేసిన పోరాటాలు, ఉద్యమాల సాక్షిగా.. ప్రజల జీవన విధానములో సంతృప్తికర స్థాయి భద్రత కలిగేలా ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరగాలన్నారు. ఓపెన్ థియేటర్ వినియోగించుకొని ప్రజా చైతన్య, స్ఫూర్తి దాయక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిధులకు వావిలాల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ తులసి సాంబశివ రావు, వైస్ చైర్మన్ రామావత్ కోటేశ్వరావు నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తమరావు,  కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ , మక్కెన అచ్చయ్య, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్, పార్లమెంట్ మహిళా నాయకురాలు డాక్టర్ గీతా హసంతి,మర్రి సుబ్బారెడ్డి, దొంతిరెడ్డి సునీతా రెడ్డి, కట్టా సాంబయ్య, కోడి రెక్క దేవదాస్, యూనస్, కౌన్సిలర్ లు తదితరులు ఉన్నారు.

Related posts

ఇరాన్ ఇన్ ట్రబుల్: కరోనా కాటు అమెరికా ఆంక్షలు

Satyam NEWS

హోలీ మామూళ్లు తో వాహన దారులకు ఇక్కట్లు

Murali Krishna

ట్రాజెడీ: గుంటలో దిగి ఇద్దరు పిల్లల మృతి

Satyam NEWS

Leave a Comment