32.7 C
Hyderabad
April 27, 2024 02: 25 AM
Slider మహబూబ్ నగర్

శ్రీరంగాపూర్ పోలీస్టేషన్ ను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు

#srirangapur

వార్షిక తనిఖీల్లో భాగంగా  వనపర్తి జిల్లా పరిధిలోని శ్రీరంగాపూర్  పోలీస్టేషన్  వార్షిక తనిఖీలలో  భాగంగా నేడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ (హైదరాబాద్) వి.ఆర్. కమలహాసన్ రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావుతో కలిసి  క్షుణ్ణంగా తనిఖీచేశారు. పోలీస్టేషన్ ను  సందర్శించి స్టేషన్లో  రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ ఆవరణంలో ఆవరణంలో మొక్కలు నాటారు.

అందులో భాగంగా పోలీస్టేషన్ పరిధిలో   నమోదు అవుతున్న గ్రేవ్  కేసుల వివరాలను, పోలీస్టేషన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ నిర్వహణ ఎలా అమలవుతుంది, గత సంవత్సరంలో  పోలీస్టేషన్ లో  ఎన్ని కేసులు నమోదు అయ్యాయి,  ఎన్ని కేసులలో నిందితులకు శిక్షలు పడ్డవి, పోలిస్టేషన్  పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాలలో నేరాలు, రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను శ్రీరంగపూర్ ఎస్సై ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే  పోలీస్టేషన్ లోని 5ఎస్ అమలు తీరును, గ్రేవ్ కేసులకు సంబంధించి సిసిటీఎఎన్. ఎస్   ప్రాజెక్ట్ ఆన్ లైన్ లో పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటాను, మరియు పిటిషన్ ఫైల్ లో ఉన్న ఎంక్వేరి రిపోర్ట్ ను పరిశీలించారు. పోలీస్టేషన్ లో నమోదయిన  కేసుల సి. డి ఫైల్స్ ను, క్రైమ్ మెమోస్, క్రైమ్ డైజెస్ట్ రికార్డ్ లను, పి. టి  కేస్ ఫైల్స్ ను, యు.ఐ. కేసుల ఫైల్స్ ను  పరిశీలించారు.  పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ప్రతి సిడి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని , గ్రేవ్ కేసులలో యుఐ ని తగ్గించాలని ఎస్సైని   ఆదేశించారు.

గ్రేవ్ కేసుల విషయంలో  సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టులో నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్, సిడిఆర్, పార్ట్ వన్, పార్ట్ టు, డిమాండ్ డైరీ, చార్జిషీట్, ఇంటరాగేషన్ రిపోర్ట్స్ ను ఆన్ లైన్లో ఎంట్రీ అవుతున్న తీరును  పరిశీలించారు. అన్ని పోలీస్టేషన్ లలో  డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను  పరిష్కరిoచేటట్లు చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ  నిర్వహించేటట్లు ఆయా  సిబ్బంది ద్వారా  చర్యలు చేపట్టాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి, కొత్తకోట సిఐ, శ్రీనివాస్ రెడ్డి, శ్రిరంగాపూరు ఎస్సై, కేటి. మల్లేష్,  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

బిసిలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంకు ప్రాధాన్యత

Bhavani

ఫుడ్ కోర్టు లో మొక్కలు నాటిన మంత్రి అల్లోల

Satyam NEWS

Leave a Comment