38.2 C
Hyderabad
April 28, 2024 20: 28 PM
Slider వరంగల్

13 మంది ఎస్సీ లబ్ధిదారులకు టైలరింగ్ మిషన్లు

#Krishna Aditya

జిల్లాలో షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం షెడ్యూల్ కులాల సహకార సేవ లిమిటెడ్ ద్వారా 92 సూక్ష్మ తరహ వ్యాపార యూనిట్ల మంజూరు అయ్యాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ లో ఎస్సీ కులాల లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా 13 మందికి సుమారు 35,400 విలువగల రెండు టైలరింగ్ మిషన్లు అందజేశారు.

14 వేల 4 వందల విలువ గల డిడి లబ్ధిదారుల పేరున అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం షెడ్యూల్ కులాల సేవా సంస్థ లిమిటెడ్ ద్వారా 92 సూక్ష్మతరహ వ్యాపార యూనిట్లు మంజూరు అయ్యాయని అన్నారు.ఈ యొక్క యూనిట్లు ఒక్కంటికి 50 వేల చొప్పున మొత్తం 49. 90 లక్షలు మంజూరు అయినాయని పాడి గేదెల యూనిట్ కి అదనంగా 10 వేలు మంజూరు చేశామన్నారు.

పాడి గేదెల యూనిట్లు 39, టైలరింగ్ 18, గాజుల యూనిట్లు 7, ఇతర 28 గాను మొత్తం 92 యూనిట్లు మంజూరు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుక్కల దాడిలో జింక మృతి

Bhavani

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Satyam NEWS

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

Satyam NEWS

Leave a Comment