30.7 C
Hyderabad
April 29, 2024 06: 33 AM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

#nellore tdp

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్, అటవీ శాఖలు ఏం చేస్తున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్ కుమార్, కురుగొండ్ల రామక్రిష్ణ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ గణేష్ ని సోమిరెడ్డి నేడు కలిశారు.

అనంతరం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతూ ప్రకృతి సంపదను దోచేస్తోందని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో అర్ధరాత్రుల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడటమే గాక తిరిగి బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. జూన్ 19, 21వ తేదీల్లో సర్వేపల్లి రిజర్వాయరులో గ్రావెల్ భారీ ఎత్తున దోపిడీకి గురవుతుంటే జీపీఎస్ ఫొటోల ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం.. లక్ష క్యూబిక్ మీటర్ల దొంగతనం జరిగితే చివరకు తీవ్ర ఒత్తిళ్ల మధ్య 10 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమేనని కేసు పెట్టారు..ఆ 10 వేల క్యూబిక్ మీటర్లకు కూడా ఢిల్లీలో ఉండే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కేసు పెట్టి ఆయనను బలిచేశారు..

అన్నీ ఎమ్మెల్యే అనుచరుల దొంగ సంతకాలు, ఒకే చేతిరాతతో దొంగ దరఖాస్తులు…వీటికి సంబంధించి అసలు దొంగలను పట్టుకోవడంపై ఈ రోజుకీ దిక్కులేదు..దరఖాస్తులో ఎంపీ అని లేదు కాబట్టి ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాదని ఇరిగేషన్ ఈఈ చెబుతున్నారు..తప్పులు మీద తప్పులు చేసేసి ఈ రోజు ఇంజనీర్లు బుకాయిస్తున్నారు..అని సోమిరెడ్డి అన్నారు. జూన్ 22న కంటేపల్లిలోని అటవీ భూముల్లో భారీగా గ్రావెల్ కొల్లగొడుతుంటే విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి దాడులు నిర్వహించి 15 టిప్పర్లు, మూడు ప్రొక్లెయిన్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు..అక్రమ మైనింగ్ చేసిన కంపెనీలకు ఐదు రెట్లు జరిమానా, ఇతర ఫెనాల్టీలు విధించాల్సివుండగా ఎమ్మెల్యే ఒత్తిడితో రూ.1.60 లక్షలు మాత్రమే వేసి వదిలేశారు..

అటవీ భూముల్లో గ్రావెల్ కొల్లగొడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా పోలీసు కేసు నమోదు చేయకుండా వదిలేశారు..కంటేపల్లి అటవీ భూముల్లో అటవీయేతర కార్యక్రమాలు చేయడం నేరమని అటవీ శాఖ అధికారులు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో స్పష్టం చేశారు.

ఆగస్టు 7న మళ్లీ అదే కంటేపల్లిలో, అదే అటవీ భూమిలో, అవే కంపెనీలు భారీ ఎత్తున గ్రావెల్ దోపిడీకి తెరలేపాయి..ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగించిన గ్రావెల్ టిప్పర్లలోని ఒక టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీగలు దళితుల నివాసంపై పడ్డాయి.. అదృష్టవశాత్తు లైన్ ట్రిప్ అయిపోవడంతో 9 మంది దళితులు ప్రాణాలతో బయటపడ్డారు..పొలాల్లో మెరకను తొలగించడానికి రైతులే అప్రూవల్ ఇచ్చారని తహసీల్దార్ సమక్షంలో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు..అని సోమిరెడ్డి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా మైనింగ్ మాఫియాను అడ్డుకోకపోతే అంతిమంగా అధికారులే బాధ్యులు కాబోతున్నారు..దోపిడీకి గురైన ప్రతి రూపాయిని కక్కించే వరకూ విశ్రమించబోము..అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొమ్మి సురేంద్ర, జెన్ని రమణయ్య, ఒట్టూరు సంపత్ యాదవ్, గుమ్మడి రాజాయాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఏలూరి రంగారావు, కాకార్ల తిరుమల నాయుడు, పనబాక భూలక్ష్మి, శ్రీపతి బాబు, ఊరందూరు సురేంద్ర, జలదంకి సుధాకర్, నన్నేసాహెబ్, ఈపూరు మునిరెడ్డి, చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆకుల హనుమంతరావు, జాకీర్ షరీఫ్, కనపర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇది సునామీ కంటే తక్కువ కాదు: ఎమ్మెల్యే సీతక్క

Bhavani

కాంగ్రెస్ ప్రభుత్వంపై వంద రోజుల్లోనే వ్యతిరేకత

Satyam NEWS

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS

Leave a Comment