26.7 C
Hyderabad
May 3, 2024 08: 25 AM
Slider కడప

కడప వైసీపీ నేతల దౌర్జన్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Bhatyala TDP

స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నాయకులు చేసిన తప్పులను అడ్డుకోవలసిన ఎన్నికల అధికారులు, పోలీసులు వారికి కొమ్ముకాసిన వైనాన్ని మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు.

సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి పరిస్థితి పై ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలను, దుర్మార్గాలను వివరించారు. నామినేషన్ వేయడానికి వచ్చినవారిని అడ్డుకొని నామినేషన్ పత్రాలను చించడం, వారిని కొట్టడం, తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించడం, నామినేషన్ విత్ డ్రా చేసుకోమని బెదిరించడం లాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.

వారి మాట ప్రకారం నడుచుకోకపోతే పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టిస్తామని బెదిరించారని బత్యాల చంగల్ రాయుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. అరాచకాలకు పాల్పడిన ఎన్నికల అధికారులపై, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇందుకు సంబంధించి ఆధారాలు అందజేశారు.

అనంతరం ఎన్నికల కమిషన్ ఆఫీస్ వద్ద మీడియా వారితో మాట్లాడారు. అధికార పార్టీ వారు చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కాదని, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులకు గురిచేసారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 90 శాతం గెలుపు కోసం వైసీపీ వారు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదని, ఈ ఆగడాలు చేసేదానికి సపోర్ట్ చేసిన ఎన్నికల అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఆయనతో పాటు కడప జిల్లా టీడీపీ ఇంచార్జ్ శ్రీనివాసులు రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మాజీ చైర్మన్ వర్ల రామయ్య, మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కొండా శ్రీనివాసులు, శ్రీకారపు శివయ్య, పుల్లారావు, అంకిపల్లి భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే

Sub Editor 2

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment