38.2 C
Hyderabad
April 28, 2024 21: 19 PM
Slider చిత్తూరు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఊపుమీదున్న టీడీపీ

#punganuru

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు తెలుగు దేశం నేతలు దూసుకు పోతున్నారు. మొత్తం 14 నియోజక వర్గాలలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పలమనేరు, పీలేరు విషయానికి వస్తే పలమనేరులో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమరనాద రెడ్డి, పీలేరులో జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇద్దరు నేతలకు టిక్కెట్టు ఖాయం అంటున్నారు. వారిని కాదని టిక్కెట్టు అడిగేవారు కూడా లేరు. పార్టీ అధికారంలోకి వచ్చి వీరు గెలిస్తే ఇద్దరికీ లేదా ఇద్దరిలో ఒకరికి  మంత్రి పదవి తప్పదని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. వీరిద్దరి గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది అంటున్నారు.

పలమనేరు నియోజకవర్గంలో ఈ సారి ఎన్ అమరనాధ రెడ్డికి తిరుగులేదని అంటున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న అమరనాధ రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి రామకృష్ణా రెడ్డి మూడు సార్లు పుంగనూరు నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఒకసారి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు చిత్తూరు ఎంపీగా ఎన్నికయ్యారు. అమరనాధ రెడ్డి రెండు సార్లు పుంగనూరులో టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. అయన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత టిడిపిలో చేరి మంత్రి అయ్యారు.

2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి వెంకట్ గౌడ చేతిలో 32,246 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఎన్నికల తరువాత నియోజక వర్గంలో ఉంటూ పార్టీని పటిష్ట పరచుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు. అంగల్లు కేసులో బెయిలు తెచ్చుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత కూడా ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ఆయన తండ్రి రామకృష్ణా రెడ్డి మూడు సార్లు ఎంపిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరి కుటుంబానికి నియోజక వర్గంలో మంచి పట్టు ఉంది. ఎన్నికలకు ఇప్పటి నుండే సమాయత్తం అవుతున్నారు. నిద్ర లేచింది మొదలు గ్రామాల్లోనే ఉంటున్నారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయనకు వాడవాడలా ఘన స్వాగతం లభిస్తోంది. మహిళలు మంగళ హరతులతో స్వాగతం పలుతున్నారు. యువత గజ మాలలతో సత్కారాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో గెలుపు సునాయాసంగా వరిస్తుందని పరిశీలకులు అంటున్నారు. రానున్న ప్రభుత్వంలో తన నేతకు మంత్రి పదవి కూడా ఖాయం అని ధీమాగా ఉన్నారు. అన్నచాటు తమ్మునిగా కిశోరే కుమార్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. రెండు సార్లు MLAగా పోటి చేసినా విజయం సాధించలేకపోయారు. మూడవసారి పోటి చేసి MLAగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

నియోజకవర్గం మొత్తం తిరుగుతూ, అందరికి అందుబాటులో ఉంటున్నారు. పీలేరు నియోజక వర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి 2014 లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 15,313 ఓట్ల తేడాతో  వైసిపి అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి చేతిలో ఓడి పోయారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి చింతల చేతిలో 7,874 ఓట్ల తేడా ఓడిపోయారు. 2009 లో ఇక్కడ గెలిచిన ఆయన అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి అమరనాద రెడ్డి మంత్రిగా పని చేశారు.

ఆ సమయంలో జిల్లాలో పరిపాలన మొత్తం కిషోర్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. అలా నియోజకవర్గమే కాదు జిల్లా అంతటా ఆయనకు సన్నిహిత సంబందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి మద్దతుగా ఉన్న  బలమైన వర్గాన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నారు. అంగల్లు కేసులో బెయిలు తెచ్చుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత కూడా నియోజక వర్గంలో కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈ సారి ఇక్కడ కిషోర్ గెలుపు ఖాయమని నియోజక వర్గం పరిశీలకులు సూరా సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు జిల్లా

Related posts

విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

Satyam NEWS

ప్రతి పంటకు మద్ధతు ధర లభిస్తుంది

Satyam NEWS

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు..

Bhavani

Leave a Comment