38.2 C
Hyderabad
April 29, 2024 14: 21 PM
Slider చిత్తూరు

వై ఎస్ జగన్ హయాంలో అప్పులు ఫుల్… అభివృద్ధి నిల్

#madanapally

చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన రాజంపేట పార్లమెంట్ టీడీపి కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజి మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బత్యాల చంగల్ రాయుడు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి  రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బత్యాల  చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ముఖ్య నాయకులు అందరూ కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ముస్లీం సోదరులు ఏర్పాటు చేసిన ప్రార్థనలో పాలుపంచుకున్నారు.అనంతరం పార్టీ నాయకులంతా కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో బత్యాల  మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన 28 నెలలలో రాష్ట్ర అభివృద్ధి నిల్ రాష్ట్రంలో అప్పులు ఫుల్ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ 28 నెలల వైసిపి పాలనలో నిత్యావసర వస్తువుల,పెట్రోల్,డీజిల్,గ్యాస్, కరెంట్ బిల్లు,పన్నులు,డ్రిప్ పరికరాలు ఇలా ప్రతి వస్తువుపై అధిక ధరలు అడ్డగోలుగా పెంచుకుంటూ పోయి రాష్ట్ర ప్రజానీకం పై గుదిబండ వేశారని అన్నారు.

కరోనా కష్ట సమయంలో రాష్ట్ర ప్రజలు జీవనాధారం లేక అట్టుడికి పోతుంటే లేని పోని పన్నులతో ప్రజలను ఇంకా బెదర కొట్టడం ఎదిరించిన వారిని తప్పుడు కేసులు పెట్టి, దుర్మార్గంగా ప్రవర్తించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం ఇప్పటి దాకా మనం చూస్తూనే ఉన్నామన్నారు.

వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని (పిల్లిని రూములో వేసి కొడితే పులై తిరగబడి దాడి చేస్తుందని) అలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై బారాన్ని వేస్తే మోయలేక ప్రభుత్వాన్ని దించేసే పని చేస్తారని బత్యాల హెచ్చరించారు.

ప్రతి వస్తువుపై దేశంలోనే అత్యధికంగా పన్నులు వేసి అమ్ముతున్న రాష్ర్టంలో మొదటి రాష్ట్రం ఆంద్రప్రదేశ్ అని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని గుర్తు పెట్టుకుని ప్రతిదీ వస్తువుపై ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జీ దొమ్మలపాటి రమేష్,పుంగనూరు ఇంచార్జీ అనీషా శ్రీనాథ్ రెడ్డి,తబళ్ళపల్లి ఇంచార్జీ శంకర్ యాదవ్,రైల్వే కోడూరు ఇంచార్జీ కస్తూరి విశ్వనాధ్ నాయుడు,టీడీపి రాష్ట్ర సాంసృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్,టీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గాజుల ఖాదర్ భాషా,సూర్యప్రకాష్,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ రామ్ చినబాబు,రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్,కడప జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బోక్కసం సునీల్,కొల్లి రమణ నాయుడు,రాజంపేట పార్లమెంట్ యువత అధ్యక్షుడు తోపిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి,కోవైట్ పోలిట్ బ్యూరో సభ్యులు గుద్దే నాగార్జున,చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐటిఐఆర్ ను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు

Satyam NEWS

కుళ్లు కుతంత్రాలు చేసేవారే అంగవికలురు

Satyam NEWS

మోదీ, కేసీఆర్ పాల‌న‌లో దేశం 40 ఏళ్లు వెన‌క్కు

Satyam NEWS

Leave a Comment