42.2 C
Hyderabad
April 26, 2024 16: 32 PM
Slider నల్గొండ

కుళ్లు కుతంత్రాలు చేసేవారే అంగవికలురు

#WorldDisableDay

అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని లారీ అసోసియేషన్ అధ్యక్షుడు, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన “ప్రపంచ వికలాంగుల(దివ్యాంగుల) దినోత్సవం” సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆయనతో బాటు 23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి సమాజంలో అవయవ లోపం ఉంటే వికలాంగులు కారని, కుళ్ళు, కుతంత్రాలు మనసులో నింపుకొని పక్క వారికి హాని చేయాలనే ఆలోచన ఉన్న వారు అంగవైకల్యుగా  మిగిలిపోతారని  కోతి సంపత్ రెడ్డి అన్నారు.

23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య మాట్లాడుతూ అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.

వికలాంగులకి (దివ్యాంగులకు) ఆర్టీసీ నుండి రాయితీతో మంజూరు చేసే  బస్సు పాస్ కి సంబంధించిన ఫీజుని అర్హులైన ప్రతి ఒక్కరికి తామిద్దరము చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Related posts

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థితత్వం కోసం పోటాపోటీ…

Satyam NEWS

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS

జైలా? బెయిలా?: సీబీఐ కోర్టు ఆదేశాలపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ

Satyam NEWS

Leave a Comment