33.7 C
Hyderabad
April 27, 2024 23: 46 PM
Slider అనంతపురం

ధర్మవరం 2టౌన్ సీఐ రాజాను తక్షణమే సస్పెండ్ చేయాలి

#paritalasriram

చట్ట వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలను చితకబాదిన ధర్మవరం సీఐ రాజాను వెంటనే సస్పెండ్ చేయాలని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, పార్లమెంట్ ఇన్ ఛార్జి పార్థసారధి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ధర్మవరం పట్టణంలోని కొత్తపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలను లోక్ అదాలత్ లో కేసుల రాజీ పేరుతో సీఐ రాజా స్టేషన్ కు పిలిపించి చితకబాదిన సంఘటన తెలిసిందే.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. పరిటాల శ్రీరామ్, పార్థసారధి ఆధ్వర్యంలో ధర్మవరంలోని గాంధీ సర్కిల్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వందలాది మంది టీడీపీ నాయకులు, బాధితులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రం అందజేసిన తరువాత డీఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

కావాలంటే వైసీపీ కండువాలు వేసుకోండి: పరిటాల

అనంతరం సీఐ రాజా వ్యవహరించిన తీరు మీద డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్పీ ఈ అంశం మీద విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నాయకులు చెప్పినట్టుగా నడుచుకుంటూ టీడీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఐ రాజా ఖాకీ దుస్తులు వదిలేసి వైసీపీ కండువా వేసుకొని, వైసీపీ జెండాలతో దుస్తులు కుట్టించి వేసుకోవాలని పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ వారు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా వ్యవహరించండి.. కానీ చిన్న చిన్న అంశాలకు చేతులు విరిగేలా కొట్టే హక్కు ఎవరివచ్చారంటూ ప్రశ్నించారు. పాత అంశాలను మనసులో పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక్కడ ఎవరూ వెనక్కు తగ్గరన్నారు. సీఐ అంత నిజాయితీగా వ్యవహరిస్తే.. మున్సిపల్ సిబ్బంది ఒక భవనానికి నోటీసు ఇచ్చారన్న కారణంతో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు జేసీబీ రమణ బహిరంగంగా దాడి చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు.

అలాగే బోరు బావులు పూడ్చి రాజకీయ కక్షలు రేపుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఏవైనా కేసులు ఉంటే ఇరు పక్షాలను రాజీ చేసి చెప్పే పద్దతి వేరుగా ఉంటుందని.. ఇలా వైసీపీ నాయకులు చెప్పినట్టు చితకబాదుతుంటే మా పద్ధతుల్లో మేము కూడా ముందుకెళ్తామని హెచ్చరించారు. భూకబ్జాలు, దందాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ.. చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వారి మీద మీ ప్రతాపం చూపించవద్దని హితవు పలికారు. చట్టం, న్యాయం మీద గౌరవం ఉందని సీఐ రాజాపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు శ్రీరామ్ చెప్పారు.

పార్టీ మారకపోతే ఎన్ కౌంటర్ చేస్తారా?

తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలు మారకపోతే ఎన్ కౌంటర్ చేస్తారా.. కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తారా అంటూ సీఐ రాజాపై హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని.. పోలీసులు పార్టీ నేతలకు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. మీ విధులు లాఅండ్ఆర్డర్ కాపడటమేనని పార్టీలు చెప్పినట్టు చేయడం కాదని హితవు పలికారు. మా వాళ్లు తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ.. పార్టీలు చెప్పినట్టు చితకబాదుతాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు. అధికార పక్షాన్ని ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉంటుందని.. అలాంటివి చేయవద్దని చెప్పాడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు ఇలాంటి దాడులు చేసి బెదిరించాలని చూస్తే ఇక్కడ ఎవరూ వెనక్కు తగ్గేవారు లేరని పార్థసారధి స్పష్టం చేశారు.

సత్యం న్యూస్, సత్యసాయి జిల్లా

Related posts

ఆంధ్రవైపు కెళ్లద్దురో డింగరీ ఆగమైపోతావురో

Satyam NEWS

నుమాయిష్ లో తెలంగాణ అటవీశాఖకు మొదటి బహుమతి

Bhavani

పంచాయతీ ఎన్నికల పై హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నాం

Sub Editor

Leave a Comment