28.7 C
Hyderabad
April 26, 2024 08: 23 AM
Slider గుంటూరు

ఇదేం ఖర్మ.. ఈ రాష్ట్రానికి: తెలుగు తమ్ముళ్ల సమరశంఖం

#nrt

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక పాలన పై ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు సమరశంఖం మోగించారు. స్థానికంగా నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్‌,యూనిట్‌,బూత్‌,వార్డు ఇన్‌చార్జ్‌లు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

ఈ నెల 2 నుంచి నెల రోజుల పాటు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ ప్రజల్లో ఉండి.. ప్రతి ఇంటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక పాలన పై ప్రజలకు వివరించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఇదేం ఖర్మ…ఈ రాష్ట్రానికి అనే పేరును నిర్ణయించారు.ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి..తమ సమస్యలను తెలుగుదేశం పార్టీ దృష్టికి తెచ్చేందుకు 92612 92612 నంబరుకు వాళ్లతో మిస్డ్‌కాల్‌ ఇచ్చే విధంగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది.

నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డు ఇస్లాంపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో కొనసాగిస్తున్న అవినీతి, అరాచక, నియంతృత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలు,మైనార్టీలు, మహిళల పై దాడులు జరుగుతున్నాయని వివరించారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వివరించారు.రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి,ఇదేమని ప్రశ్నిస్తున్న వారి పై కేసులు,దాడులతో కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ రాష్ట్రం మళ్లీ బాగుపడాలంటే.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్,పట్టణ మైనార్టీ అధ్యక్షుడు బడే బాబు,సీనియర్ నాయకులు మాదిన ఖాజా,మాదిన రసూల్,పెరికాల రాయప్ప,పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు నాగూర్,వార్డ్ ప్రెసిడెంట్ మాబు బాషా,బంగారం,సుభాని,దరియా వలి,మస్తాన్,మహమ్మద నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కరోనా ట్రాజెడీ: ఆగిన మగ్గం ఆకలితో నేతన్నలు

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కోసం వనపర్తి జిల్లా సిద్ధం

Satyam NEWS

వినుకొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment