37.2 C
Hyderabad
May 2, 2024 13: 09 PM
Slider ప్రత్యేకం

మండుటెండ‌లో విసినిక‌ర్ర‌ల‌తో టీడీపీ “బాదుడే బాదుడు” కార్య‌క్ర‌మంతో నిర‌స‌న‌…!

ఆయ‌న కేంద్ర మాజీ మంత్రి…పైగా తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు…అంతేనా టీడీపీకి ద‌న్నుగ‌ల నేత‌..పార్టీలో ఎంత క్రీయాశీల‌కంగా ఉంటారో..అంతే ముక్కుసూటిగా త‌న జిల్లాలోనూ, నియోజ‌క వ‌ర్గంలోనూ ఉంటారు.గ‌తంలో పార్టీ ప‌రగా ఎమ్మెల్యేగా గెలిచి ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్టీలోనే ఉంటూ జిల్లా కేంద్రంలో వేరే కుంప‌టి పెట్టినా…కేంద్ర మాజీ మంత్రి ఉంటున్న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూ ఉండ‌టంతో.. ఆ కేంద్ర మాజీ మంత్రి విలువ, ప్రాముఖ్య‌త ఏంటో ఈ పాటికి అర్ద‌మై ఉంటుంది.

ఆయ‌నే విజ‌య‌న‌గ‌రం నియోజ‌క వ‌ర్గ నేత ,మాజీ ఎంపీ..గ‌తంలో మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఉంటున్న అశోక్ బంగ్లా అధినేత‌…పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో అన్ని చార్జీల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచ‌గా తాజాగా ఆర్టీసీ బ‌స్ చార్జీలు కూడా అమాంతంగా పెంచ‌డంతో…బాదుడే బాదుడు అన్న పేరుతో ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేష‌న్ వ‌ద్ద నుంచీ గంట‌స్థంబం వ‌ర‌కు నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టింది. ముందుగా వీఎంసీ వ‌ద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి అశోక్ గ‌జ‌ప‌తి రాజు పూల‌దండ వేసారు.

అక్క‌డ నుంచీ పార్టీ నేత‌లు బాదుడే బాదుడు అంటూ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్దం అయ్యారు. అందులో భాగంగా ప్ర‌తీ ఒక్క‌రికీ విసినికర్ర‌లు పంచి…త‌మ నిర‌న‌న‌ను వ్య‌క్తం ప‌రిచారు. దీంతో వాటిని ప‌ట్టుకుని అశోక్ తో పాటు పార్టీ నేత‌లైన క‌న‌క‌ల‌,విజ్జపు ప్ర‌సాద్, ఐవీపీ, ప్ర‌సాదుల‌క‌న‌క‌మ‌హ‌లక్ష్మి, అనురాద బేగం… త‌దిత‌రులంతా న‌డుచుకుంటూ గంట‌స్థంభం వ‌ర‌కు వెళ్లారు.అక్క‌డే ప్ర‌కాష్ సిల్క్ ప్యాల‌స్ వ‌ద్ద‌..న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికి టీడీపీ విసిని క‌ర్ర‌ల‌ను పంపిణీ చేసింది. ఈ సంద‌ర్బంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ..ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం…ప్ర‌తీ చార్జీల‌ను పెంచి…చివ‌ర‌కు సామాన్య‌డు బ‌త‌క‌నీయ‌కుండా చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

మొన్న మ‌ద్యం చార్జీలు ,నిన్న విద్యుత్ చార్జీలు తాజాగా ఆర్డీసీ చార్జీలు పెంచి..ఏ ఒక్క‌రూ బ‌త‌క‌నీయ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని విమ‌ర్శించారు. ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌తోనే టీడీపీ “బాదుడే బాదుడు” కార్యక్ర‌మం చేప‌ట్టింద‌న్నారు. ఇక ఇలా ప్ర‌తీ ధ‌ర‌ల‌ను ఈ ప్ర‌భుత్వం పెంచుకుంటూ వెళ్లిపోతే… బ‌త‌క‌డం క‌ష్ట‌మేన‌ని అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆవేద‌న వ్యక్తం చేసారు.

Related posts

మళ్లీ ప్రమాదం అంచున ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలు

Satyam NEWS

డోనాల్డ్ ట్రంప్ ఇక వైట్ హౌస్ ఖాళీ చేయాల్సిందే

Satyam NEWS

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment